కరోనా వైరస్‌‌: వ్యాక్సిన్ తయారీ టీమ్‌కు మనోడే లీడర్

Published : Feb 07, 2020, 05:53 PM IST
కరోనా వైరస్‌‌: వ్యాక్సిన్ తయారీ టీమ్‌కు మనోడే లీడర్

సారాంశం

కరోనా వైరస్ కు విరుగుడుగా  వ్యాక్సిన్ తయారీకి  ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీలో ఇండియన్ డాక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

న్యూఢిల్లీ:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ తయారీ బృందంలో భారత సంతతికి చెందిన సైంటిస్ట్ 
డాక్టర్  ఎస్ఎస్ వాసన్  ఈ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

చైనాలో  ఇప్పటికే 30 వేల మందికి  ఈ వ్యాధి సోకింది. మరో 600 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. కరోనా వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ తయారు చేసేందుకు  డాక్టర్ల బృందం ప్రయత్నాలను చేస్తోంది.

కామన్ వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్ఓ)లో  ఈ బృందం వ్యాక్సిన్ తయారు చేయనుంది. అస్ట్రేలియాకు చెందిన లీడింగ్ సైంటిఫిక్ ఏజెన్సీ.

వాసన్ టీమ్ మెల్‌బోర్న్‌లోని డోర్నీ ఇనిస్టిట్యూట్ లో కరోనా వైరస్‌ను డెవలప్ చేశారు. ఈ వైరస్ ను మనిషి షాంపిల్స్ నుండి విజయవంతంగా వేరు చేశారు.కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ కీలక దశకు చేరుకొన్నట్టుగా సీఐఎస్ఆర్ఓ ప్రకటించింది.

Also read:వూహాన్‌లోని జ్యోతికి మంత్రి ఫోన్: అఖిలప్రియ వద్ద స్పృహ తప్పిన తల్లి

ఈ వైరస్‌ను  అభివృద్ది చేసేందుకు ఈ బృందం రకరకాల ప్రయోగాలను చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నట్టుగా టీమ్ తెలిపింది. బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ విద్యార్థి.

వాసన్ గతంలో డెంగ్యూ, జికా, చికెన్ గున్యాలపై ఆయన పనిచేశారు.  ఈ వ్యాక్సిన్ తయారీ కోసం కనీసం 16 వారాల పాటు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని టీమ్ ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో 240 కేసులు  నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result