చపాతీలో అమ్మకు లేఖలు:మెహబూబా ముఫ్తీ కూతురు

By narsimha lodeFirst Published Feb 7, 2020, 3:16 PM IST
Highlights

గృహ నిర్భంధంలో ఉన్న తన తల్లితో మాట్లాడేందుకు వినూత్నంగా ప్రయత్నం చేసినట్టుగా మెహబూబా ముఫ్తీ కూతురు చెప్పారు. 


న్యూఢిల్లీ: నిర్భంధంలో ఉన్న  తన తల్లికి చపాతీలో లెటర్లు పంపినట్టుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తికా ముఫ్తీ చెప్పారు. 

ఆరు నెలలుగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు గృహ నిర్భంధంలో ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  వీరిద్దరిని గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే.

 తన తల్లితో మాట్లాడేందుకు అవకాశం లేకపోవడంతో చపాతీలలో లేఖలు పెట్టి  పంపినట్టుగా ఆమె చెప్పారు. ఈ లేఖల ద్వారానే  తాను   తన తల్లితో మాట్లాడినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు. మానసికంగా, ఆర్ధికంగా తాము అనేక కష్టాలను ఎదుర్కొన్నట్టుగా ఆమె చెప్పారు. ముఫ్తీపై కూతురు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

తన  తల్లిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రోజును తాను ఏనాటికి మరిచిపోలేనని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.  అమ్మకు పంపిన భోజనం బాక్సులో తనకు ఓ లెటర్‌ను పంపిందని ఆమె చెప్పారు. 

ఆ తర్వాత చపాతిలో తాను ఓ లేఖ రాసి తన తల్లికి పంపినట్టుగా ఆమె చెప్పారు.   గత ఏడాది ఆగష్టు 5వ తేదీన  మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు నిర్భంధంలో ఉన్నారు.

click me!