మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్న అమిత్ షా.. అదనపు బలగాల మోహరింపు..

By team telugu  |  First Published Oct 22, 2021, 10:30 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా తొలిసారి ఇక్కడ పర్యటించనున్నారు.  మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్టోబర్ 23 నుంచి 25 వరకు అమిత్ షా అక్కడ పర్యటించనున్నారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా తొలిసారి ఇక్కడ పర్యటించనున్నారు.  మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్టోబర్ 23 నుంచి 25 వరకు అమిత్ షా అక్కడ పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులపై లక్షిత దాడులు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవం కానున్నారు. అలాగే కేంద్ర  భద్రత బలగాతో సమీక్ష చేపట్టునున్నారు. అంతేకాకుండా  ఆయన  పలువురు  పారిశ్రామిక వేత్తలతో  సమావేశం  అయ్యే  అవకాశం ఉంది. అక్టోబర్ 23 వ తేదీ సాయంత్రం శ్రీనగర్-షార్జా డైరెక్ట్ విమానాన్ని హోంమంత్రి ప్రారంభించే అవకాశం కూడా  ఉంది. 

అలాగే 24 న జమ్మూలో జరిగే బహిరంగ సభలో హోంమంత్రి ప్రసంగించే అవకాశం ఉంది. అమిత్ షా పర్యటన  నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతపై సమీక్ష జరిపిన  తర్వాత అదనపు  బలగాలను మోహరించారు. కేవలం  శ్రీనగర్‌లోనే 20 నుంచి 25 అదనపు కంపెనీల పారామిలటరీ బలగాలను  మోహరించినట్టుగా సమాచారం. అమిత్ షా పర్యటనలో ఎటువంటి  అవాంఛనీయ ఘటనలు  చోటుచేసుకుండా చర్యలు చేపట్టారు.

Latest Videos

undefined

ఇక,  ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. వారిలో స్కూల్  ప్రిన్సిపాల్, రసాయన శాస్త్రవేత కూడా  ఉన్నారు. ఈ ఘటనలతో  సంబంధం ఉన్న 17 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టుగా జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీ (టీఆర్‌ఎఫ్) జిల్లా కమాండర్ షోపియాన్ ఆదిల్ వనీ సోమవారం హత్యకు గురైనట్లు కాశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఇక, గురువారం రాత్రి శ్రీనగర్‌లోని చానపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read: పిల్లోడి వయసు ఏడాది.. నెలకు రూ. 75 వేల ఆదాయం.. అతడు ఏం చేస్తున్నాడంటే..

జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా అమిత్ షా తొలుత శ్రీనగర్ చేరుకుంటారని, ఆ తర్వాత జమ్ము వెళ్తారని జమ్మూకశ్మీర్ బీజేపీ నేత సునీల్ శర్మ తెలిపారు. అలాగే, తిరిగి ఢిల్లీ వెళ్లడానికి ముందు కశ్మీర్‌ను సందర్శిస్తారని పేర్కొన్నారు.

click me!