మహిళ కిడ్నాప్.. కొట్టి, జుట్టు కత్తిరించి.. అఘాయిత్యానికి పాల్పడి..

Published : Oct 22, 2021, 10:26 AM ISTUpdated : Oct 22, 2021, 10:29 AM IST
మహిళ కిడ్నాప్..  కొట్టి, జుట్టు కత్తిరించి.. అఘాయిత్యానికి పాల్పడి..

సారాంశం

దుండగులు ఆమెపై కన్నేసి.. ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై దారుణానికి ఒడి గట్టారు.  ఆ మహిళ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆమెను అత్యంత దారుణంగా కొట్టి, జుట్టు కత్తిరించారు

రోజురోజుకీ సమాజంలో మహిళలకు రక్షణ కరువైపోతుంది. పాలు తాగే పసి పిల్ల దగ్గర నుంచి.. కాటికి కాళ్లు చాపుకున్న ముసలమ్మల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా.. ఓ మహిళను కిడ్నాప్ చేసి... ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. ఆమె జట్టు మొత్తం కత్తిరించి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: భార్య, అత్తను చంపేసి.. బావ మరిదిని తుపాకీతో కాల్చేసి

రాజస్తాన్‌లోని నాగౌర్‌ జిల్లాకి  చెందిన 35 ఏళ్ల మహిళను ముగ్గురు దుండగులు కిడ్నాప్‌ చేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళ తన బిడ్డతో కలిసి షాపింగ్ కి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.  దుండగులు ఆమెపై కన్నేసి.. ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై దారుణానికి ఒడి గట్టారు.  ఆ మహిళ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆమెను అత్యంత దారుణంగా కొట్టి, జుట్టు కత్తిరించారు. పైగా ఆ నిందుతులు ఆమెను 6 గంటలు బంధించి ఉంచారు.

Also read: మైనర్ తో వివాహిత అక్రమ సంబంధం.. కత్తెరతో పొడిచి, నిప్పంటించి యువతి హత్య.

ఈ మేరకు పోలీసులు బాధితురాలి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నాగౌర్ సీఐ వినోద్ సీపా మాట్లాడతుతూ..." సంఘటనా స్థలానికి చేరుకుని ఒక నిందుతుడిని అదుపులోకి తీసుకున్నమని మిగతా ఇద్దరూ ఆచూకి కోసం గాలిస్తున్నాం. బాధిత మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం జెఎల్‌ఎన్  ఆసుపత్రికి తరలించాం" అని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport