షాక్: చనిపోయాడనుకొంటే బతికాడు, డెడ్ బాడీ ఆసుపత్రిలో అప్పగింత

First Published Jun 21, 2018, 5:41 PM IST
Highlights

మహరాష్ట్రలో వింత ఘటన

ముంబై: బతికుండగానే ఓ వ్యక్తిని చనిపోయాడని  చెప్పి మరోకరి మృతదేహన్ని అప్పగించారు మహరాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. అయితే అంత్యక్రియల సమయంలో  తాము తీసుకొచ్చిన మృతదేహం తమకు చెందినవారిది కాదని  గుర్తించి తిరిగి ఆసుపత్రిలో అప్పగించారు. అయితే  తమవ్యక్తి బతికే ఉన్నాడని తెలుసుకొని ఆ కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ ఘటన  మహరాష్ట్రలో చోటు చేసుకొంంది.


మహారాష్ట్రలోని  సాంగ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం బట్టబయలైంది.  అవినాశ్ దాదాసాహెబ్ బగ్వాడే  అనే వ్యక్తిని అనారోగ్య కారణాలతో సాంగ్లి సివిల్ ఆసుపత్రిలో చేర్చారు.  అవినాశ్ దాదాసాహెబ్ బగ్వాడే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే  ఆయన చనిపోయాడని కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారాన్ని ఇచ్చారు.  అంతేకాదు మృతదేహన్ని కూడ అప్పగించారు.

దీంతో బగ్వాడే  మృతదేహన్ని అంత్యక్రియలకు సాంగ్లికి 25 కి.మీ. దూరం తీసుకెళ్ళారు.  అంత్యక్రియలు నిర్వహించే సమయంలో బగ్వాడే మృతదేహం కాదని  కుటుంబసభ్యులు అనుమానించారు. అంతేకాదు  దీంతో  మృతదేహంపై ఉన్న వస్త్రాన్ని తొలగించి చూశారు. అయితే అప్పుడు ఆ మృతదేహం అవినాశ్ ది కాదని తేలింది.

వెంటనే ఆ మృతదేహన్ని  తిరిగి సాంగ్లికి తీసుకెళ్ళారు.  అవినాశ్ మృతదేహం కాదని ఆసుపత్రి సిబ్బందికి  తేల్చి చెప్పారు.  ఆ మృతదేహన్ని ఆసుపత్రిలో అప్పగించారు. అవినాశ్ కోసం ఆరా తీశారు.  అయితే ఆసుపత్రిలో అవినాష్ అప్పటికే   చికిత్స పొందుతున్నారు. అంతేకాదు వైద్య  చికిత్స కు కూడ స్పందిస్తున్నారు. 

ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండ్ కు అవినాశ్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై 48 గంటల్లోగా నివేదిక ఇస్తామని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.సుబోధ్‌ ఉగానే వెల్లడించారు. 

click me!