మురికి కుంటలో వివాహ వార్షికోత్సవం.. బ్యాండ్ లు కొడుతూ డ్యాన్స్ చేసిన స్థానికులు..ఎందుకంటే ?

By Sairam Indur  |  First Published Feb 6, 2024, 1:38 PM IST

ఓ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని మురికి కుంటల మధ్య, చెత్తా చెదారం పోగై ఉన్న ప్రాంతంలో జరుపుకుంది. ఈ విచిత్ర ఘటన యూపీలోని ఆగ్రాలో జరిగింది. (Agra couple celebrates their wedding anniversary in a dirty pond) దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సాధారణంగా వివాహ వార్షికోత్సవాన్ని ఆహ్లాదకరైమన ప్రదేశంలో జరపుకుంటారు. కుదిరిన వాళ్లు విదేశాల్లోనో, లేకపోతే భారత్ లోని లక్షద్వీప్, గోవా వంటి ప్రాంతంల్లో జరుపుకుంటారు. మధ్యతరగతి ప్రజలైతే ఇంట్లోనే సాదాసీదాగా చేసుకుంటారు. కానీ ఓ జంట మాత్రం వివాహ వార్షికోత్సవాన్ని మురికి కుంట దగ్గర, చెత్తా చెదారం పోగైన ప్రాంతంలో జరుపుకుంది. స్థానికులు కూడా బ్యాండ్ లు వాయిస్తూ, డ్యాన్సులు చేశారు. 

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ..

Latest Videos

ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా నగరంలోని నాగలా కాళీ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారడం, ఎన్ని సార్లు చెప్పినా అధికారులు, నాయకులు పట్టించుకోపోవడంతో భగవాన్ శర్మ, ఉమాశర్మ దంపతులు ఈ వినూత్న పనికి పూనుకున్నారు. చాలా కాలం నుంచి ఈ సమస్య ఎదురువుతుండటంతో ఆ జంట తమ 17వ పెళ్లి రోజును డ్రైనేజీ, చెత్తా చెదారం పోగైన ప్రాంతంలో జరుపుకుంది. 

BIMARU Couple from UP weds near drain to protest filth in BIMARU city Agra pic.twitter.com/2KW8JEjAjo

— Humans of BIMARU (@HumansofBimaru)

15 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని, అయితే గత ఎనిమిది నెలలుగా రోడ్డు మురికి కాలువగా మారిందని స్థానికులు వాపోయారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, డ్రైనేజీ సక్రమంగా నిర్మించకపోతే ఓటు వేయబోమని నిరసన తెలిపారు.

హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ ప్రయోగం సక్సెస్.. దీంతో ఉపయోగాలు ఏంటంటే ?

వాస్తవానికి నాగలా కాళీ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డును 30కి పైగా కాలనీల ప్రజలు ఉపయోగిస్తున్నారు. కానీ చాలా కాలంగా ఈ రోడ్డు మురికి కుంటలా మారింది. అక్కడ అపరిశుభ్రం రాజ్యమేలుతుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు 2 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. ఇక్కడ 10 నుండి 12000 మధ్య జనాభా జీవిస్తున్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బేబీ రాణి మౌర్య మంత్రిగా కూడా ఉండటం గమనార్హం. 

కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలోని చాలా కాలనీల ప్రజలు తమ ఇంటి ముందు పోస్టర్లను అంటించారు. అందులో ‘డెవలప్ మెంట్ లేదు కాబట్టి.. ఓటు కూడా లేదు’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  దీంతో విసుగు చెందిన భగవాన్ శర్మ తన భార్య ఉమాశర్మతో కలిసి ఈ వినూత్న నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

click me!