అగ్నిపథ్ స్కీమ్ జాతీయ అభివృద్ధికి తోడ్పడుతుంది - రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Published : Jan 03, 2023, 05:02 PM IST
అగ్నిపథ్ స్కీమ్ జాతీయ అభివృద్ధికి తోడ్పడుతుంది - రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

సారాంశం

అగ్నిపథ్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన అభ్యర్థులకు విద్యతో పాటు మంచి నైపుణ్యాలు అందుతాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇందులో శిక్షణ పొందిన యువకులు జాతీయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతారని అన్నారు. 

అగ్నిపథ్ స్కీమ్ ను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గేమ్ ఛేంజర్ గా మంగళవారం అభివర్ణించారు. ఇది జాతీయ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. అగ్నివీర్ మొదటి బ్యాచ్ కు శిక్షణ ప్రారంభమైందని ఆయన ప్రకటించారు. అగ్నివీర్ల భవిష్యత్తు కోసం 12వ తరగతి వరకు విద్యను అందిస్తామని చెప్పారు.

ఐబీ హెచ్చ‌రిక‌లు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ భ‌ద్ర‌త పెంపు

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నివర్లు తమ విద్యను పూర్తి చేస్తూనే, శిక్షణ సమయంలో కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఇందులో శిక్షణ పొందిన యువకులకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుందని, వీరంతా జాతీయ అభివృద్ధికి తోడ్పడుతారని చెప్పారు. వీరికి విద్యను అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కోసం ట్రేడ్ సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. 

కాగా.. మహారాష్ట్ర నాగ్ పూర్ లోని గార్డ్స్ రెజిమెంటల్ సెంటర్ లో అగ్నివర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభమైందని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి ధృవీకరించారు. డిసెంబర్ 25 నుంచి 31 మధ్య నాగ్ పూర్ కాంప్టీలోని గార్డ్స్ రెజిమెంటల్ సెంటర్ లో మొత్తం 112 అగ్నివర్లు రిపోర్ట్ చేశారని చెప్పారు. అగ్నివీర్ కు రూ.11.75 లక్షలు లభిస్తాయని, అలాగే వారు విద్యాపరమైన ప్రయోజనాలు, నైపుణ్యాలను పొందుతారని ఆయన తెలిపారు. అగ్నివీర్లకు ఆరు నెలల శిక్షణ జనవరి 2 న ప్రారంభమైదని, మరింత శిక్షణ కోసం భారత సైన్యంలోని యూనిట్లకు పంపుతారని చెప్పారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి న‌డిచిన‌ రా మాజీ చీఫ్ ఎఎస్ దులత్

అలాగే అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జనవరి 1వ తేదీన శిక్షణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ‘‘ మూడు వేల మందితో అగ్నివీర్ వాయు మొదటి బ్యాచ్  శిక్షణ ఈరోజు (ఆదివారం) నుంచి బెలగావిలోని ఎయిర్‌మెన్ ట్రైనింగ్ స్కూల్ (ఏటీఎస్)లో ప్రారంభమైంది” అని పేర్కొంది. ఈ సందర్భంగా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఏటీఎస్ ను సందర్శించి కొత్తగా రిక్రూట్ అయిన బ్యాచ్‌ని ఉద్దేశించి ప్రసంగించారు.

షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం సైనికులను నియమించుకునేందుకు గతేడాది జూన్ 14వ తేదీన కేంద్రం ఈ అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. లెగసీ సిస్టమ్ స్థానంలో సాయుధ దళాల ఏజ్ ప్రొఫైల్‌ను తగ్గించడానికి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం, సాంకేతికంగా నైపుణ్యం ఉన్న దళాన్ని రూపొందించడానికి దీనిని రూపొందించారు. అయితే ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేశారు. రైల్వే స్టేషన్లకు వెళ్లి పట్టాలపై కూర్చుకున్నారు. రైళ్లను, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. అలాగే రోడ్లపై వాహనాలను తగులబెట్టారు. ఈ ఆందోళన వల్ల రైల్వే ఆస్తులకు భారీ నష్టమే చేకూరింది. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ నిరసనల వల్ల దాదాపు 2 వేలకు పైగా రైళ్లు రద్దయ్యాయి. దాదాపు రూ.259.44 కోట్ల మేర ఇండియన్ రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లింది.

భూమిలో పూడ్చిపెట్టుకుని రైతు వినూత్న నిరసన.. ‘ఆ పథకం కింద నాకు రావాల్సిన భూమి ఇవ్వాల్సిందే’ (వీడియో)

ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపున్న అభ్యర్థులను ఆర్మీ, నేవి, వైమానిక దళాలకు ఎంపిక చేస్తారు. దీని కింద ఎంపికైన వారు నాలుగు సంవత్సరాల పాటు పని చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల తరువాత వారిలో 25 శాతం మందిని ఉద్యోగాల్లోనే ఉంచి, మిగితా వారిని ఇంటికి పంపిస్తారు. ఆ 25 శాతం అభ్యర్థులు రెగ్యులర్ కేడర్‌లో 15 సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగుతారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?