బాబోయ్.. మళ్లీ 10 వేలు దాటిన కరోనా కొత్త కేసులు..పెరిగిన మృతుల సంఖ్య..

By Asianet NewsFirst Published Apr 15, 2023, 2:17 PM IST
Highlights

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,753 కోవిడ్ -19 కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిసి ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 53 వేలు దాటాయి. 

కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొంత కాలం నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 10,753 కోవిడ్ -19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720 కు చేరుకుంది.

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం.. బీహార్ లో ఘటన

గత 24 గంటల్లో 27 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,091కి చేరింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉండగా, ప్రస్తుతం రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 6,628 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,42,23,211కి పెరిగింది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్

 రోజువారీ పాజిటివిటీ రేటు 6.78గా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.49గా నమోదైంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,08,022)గా ఉంది. కరోనా కోసం ఇప్పటివరకు మొత్తం 92.38 కోట్ల పరీక్షలు జరిగాయి. అదే సమయంలో గత 24 గంటల్లో 1,58,625 పరీక్షలు జరిగాయి. తాజాగా సంభవించిన మరణాల్లో ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్రలో నలుగురు, రాజస్థాన్ లో ముగ్గురు, ఛత్తీస్ గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో ఒక్కొరు చొప్పున ఉన్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. ఎన్నికల బరిలోకి మిత్రపక్షం ఎన్సీపీ..

కాగా.. కరోనాతో మరణాలు, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు సూచించాయి.

click me!