ముగిసిన ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటన.. ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుందంటూ మాక్రాన్ ట్వీట్

By Asianet News  |  First Published Jul 15, 2023, 8:53 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ప్రాన్స్ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ పర్యటనలో ప్రధాని మోడీ ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో రక్షణ, అంతరిక్షం, పౌర అణు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వాతావరణ చర్యలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. 


భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన శుక్రవారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా ‘‘ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుంది’’ అంటూ ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో ప్రధాని మోడీ పర్యటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో కలిసి దిగిన సెల్ఫీని మాక్రాన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.

కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత మృతి.. ఐదు నెలల్లో 8వ మరణం.. ఏడో పులి చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఘటన

Latest Videos

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో భేటీపై ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా మిత్రుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో చర్చలు చాలా ఫలప్రదమయ్యాయి. భారత్-ఫ్రాన్స్ సంబంధాలపై పూర్తి స్థాయిలో సమీక్షించాం. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.’’ అంటూ ట్వీట్ చేశారు.

Vive l’amitié entre l’Inde et la France !
Long live the French-Indian friendship!
भारत और फ्रांस के बीच दोस्ती अमर रहे! pic.twitter.com/f0OP31GzIH

— Emmanuel Macron (@EmmanuelMacron)

ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన : కీలక పరిణామాలు
పీ75 కార్యక్రమం కింద మూడు అదనపు జలాంతర్గాముల నిర్మాణానికి మజ్గాన్ డాక్ యార్డ్ లిమిటెడ్, నేవల్ గ్రూప్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-ఫ్రాన్స్ సహకారం రోడ్ మ్యాప్, ఫ్రెంచ్ విద్యా సంస్థల (మాస్టర్స్, ఆపై) నుంచి డిగ్రీ హోల్డర్లుగా ఉన్న భారతీయులకు ఐదేళ్ల కాలపరిమితి షార్ట్-స్టే స్కెంజెన్ వీసా జారీ చేయడం వంటివి ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన యొక్క ఇతర ఫలితాలలో ఉన్నాయి.

The talks with my friend, President were very productive. We reviewed the full range of India-France relations. I am particularly enthusiastic about deepening cooperation in futuristic sectors like green hydrogen, renewable energy, AI, semiconductors and more. pic.twitter.com/kNxPGYj5Fh

— Narendra Modi (@narendramodi)

యుద్ధ విమాన ఇంజిన్ సంయుక్త అభివృద్ధికి తోడ్పడటం ద్వారా అధునాతన ఏరోనాటికల్ సాంకేతిక పరిజ్ఞానంలో తమ రక్షణ సహకారాన్ని విస్తరించాలని భారత్, ఫ్రాన్స్ శుక్రవారం నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీవో) మధ్య ఈ ఏడాది చివరిలోగా సిద్ధం చేయనున్నారు.

వ్యాపార సహకారాన్ని వైవిధ్యపరిచే మార్గాల గురించి చర్చించడానికి ప్రధాని మోడీ టాప్ సీఈవోలతో సమావేశమయ్యారు. అక్కడ ఆయన భారతదేశంలో సంస్కరణలను నొక్కి చెప్పారు. మన దేశం అందించే అనేక అవకాశాలను ఉపయోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ముగ్గురు వలస కార్మికులను హతమార్చిన ఉగ్రవాదులు..

కాగా.. ఎలిసీ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వాతావరణ చర్యలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారని పేర్కొన్నారు. 
 

click me!