రీల్స్ వ్యసనం.. ట్రాక్ పక్కన నిలబడి వీడియోలు తీస్తుండగా రైలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

By team teluguFirst Published Dec 16, 2022, 9:13 AM IST
Highlights

రీల్స్ వ్యసనం ముగ్గురు ప్రాణాలు తీసింది. రైల్వే ట్రాక్ పక్కన నిలబడి వీడియోలు తీసుకుంటుండగా వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ప్రాతంలో చోటు చేసుకుంది. 

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకునేందుకు కొందరు నానా తంటాలు పడుతున్నారు. ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జలపాతాల దగ్గర సెల్పీలు తీసుకుంటూ, వీడియోలు చేస్తూ అందులో పడిపోయిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయడానికి రీల్స్ తీస్తుండగా ఓ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 

తల్లితో సింహం పిల్లల సయ్యాటలు.. తెల్ల సింహానికి నెటిజన్లు ఫిదా..

ఘజియాబాద్‌ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) ఇరాజ్ రాజా తెలిపిన వివరాల ప్రకారం.. మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషాహిద్ కాలనీకి చెందిన నదీమ్ (23), అతడి భార్య జైనాబ్ (20), షకీల్ (30)లు రీల్స్ తీసుకునేందుకు బుధవారం రాత్రి మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలూ గర్హి రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు. అయితే వారంతా రీల్స్ తీయడంలో నిమగ్నమయ్యారు. 

పబ్లిక్ టాయిలెట్‌ వాడుకుని డబ్బులివ్వలేదని ఒకరి హత్య.. ముంబైలో దారుణం..

రాత్రి 9 గంటల సమయంలో ఆ ట్రాక్ పై పాత ఢిల్లీ నుండి ప్రతాప్‌గఢ్ జంక్షన్‌కు వెళ్లే పద్మావత్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలు వేగంగా వస్తోంది. కానీ దీనిని వారు గమనించలేదు. రైలు లోకో పైలెట్ వీరిని గమనించి హారన్ కొట్టినా వారు వినిపించుకోలేదు. దీంతో వేగంగా ఉన్న రైలు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. అనంతరం రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. 

రెండు బ‌స్సులు ఢీ .. ఒక‌రు మృతి, 41 మంది గాయాలు

హారన్ కొట్టినా తప్పుకోలేదు - లోకో పైలెట్ 
ఈ ఘటనపై పద్మావత్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలు మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రతాప్‌గఢ్ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో ట్రాక్ పై ఓ మొబైల్ ప్లాష్ లైట్ కనిపించిందని అన్నారు. అక్కడ ముగ్గురు నిలబడి ఉన్నారని గమనించానని దీంతో వారిని హెచ్చరించేందుకు హారన్ చాలా సార్లు మోగించానని తెలిపారు. కానీ వారు తప్పుకోలేదని చెప్పారు. దీంతో వేగంగా రైలు వారిని ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారని అన్నారు. 

రాష్ట్రాలు ఏకరీతి పౌర స్మృతిపై చట్టాలు చేయవచ్చు.. : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

సెల్ఫీల వ్యామోహం వల్ల ఇలాంటి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న ఘటనలు ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. పరిశోధులకు దీనిని ‘‘కిల్ఫీస్’’ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవుదామని ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు. 

click me!