బోర్‌వెల్‌లో పడిన 8 ఏళ్ల బాలుడు మృతి.. 24 గంటలుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్..

Published : Mar 15, 2023, 01:30 PM ISTUpdated : Mar 15, 2023, 01:45 PM IST
బోర్‌వెల్‌లో పడిన 8 ఏళ్ల బాలుడు మృతి.. 24 గంటలుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్..

సారాంశం

బోరుబావిలో పడిన ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడడానికి గత 24గంటలుగా చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం అయ్యింది. బాలుడు మృతి చెందాడు.

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లా ఖేర్ ఖేడీ గ్రామంలో మంగళవారం 60 అడుగుల లోతైన బోరుబావిలోఎనిమిదేళ్ల చిన్నారి పడిపోయాడు. ఆ బాలుడిని లోకేష్‌ గా గుర్తించారు. బోరుబావిలో పడిన ఆ బాలుడిని రక్షించే చర్యలు విషాదాంతంగా ముగిసింది. బాలుడుని బయటికి తీసిన తరువాత పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. 

అంతకుముందు.. "బోర్‌వెల్‌కు సమాంతరంగా తవ్వే పని పూర్తయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఇప్పుడు బోరువాకి సమాంతరంగా తవ్విన ప్రాంతానికి మధ్య సొరంగాన్ని తయారు చేస్తుంది. పిల్లవాడిని సురక్షితంగా ఉంచడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశాం. ఆ తర్వాత సొరంగం తవ్వకం పనులు మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి మరో గంటన్నర నుంచి 2 గంటలు పడుతుంది" అని విదిశ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమీర్ యాదవ్ చెప్పారు.

ప్లాస్టిక్ కవర్లో చుట్టి.. ఇంట్లో దాచి పెట్టిన మహిళ మృతదేహం.. కూతురిపై అనుమానం...

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు 43 అడుగుల వద్ద ఇరుక్కుపోయాడు. వైద్యుల బృందం బాలుడిని ప్రాణాలతో ఉంచడానికి తగిన చర్యలను పర్యవేక్షిస్తోంది. అయితే, "బోరుబావిలో చాలా లోతుకు పడిపోవడం వల్ల పిల్లాడు నిన్నటినుంచి ఏమీ తినలేదు. అతడికి ఆహారం అందించే అవకాశం కూడా లేదు. అయితే,ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూను వేగవంతం చేయడానికి హామీ ఇచ్చిందని.. పిల్లవాడు త్వరలో సురక్షితంగా బయటపడతారని ఆశిస్తున్నామని" అని పోలీసులు తెలిపారు.

ఓ బాలుడు బోరుబావిలో పడ్డాడన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. 24 గంటలు గడుస్తున్నా బాలుడు బయటికి రాలేదు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !