తెలంగాణలో జోరుగా సాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. తళుక్కున మెరిసిన బాలీవుడ్ తార..

Published : Nov 02, 2022, 12:17 PM IST
తెలంగాణలో జోరుగా సాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. తళుక్కున మెరిసిన బాలీవుడ్ తార..

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, చిత్ర నిర్మాత పూజా భట్ జోడో యాత్రలో తళుక్కున మెరిసింది. ఆమె రాహుల్‌తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యకర్తలను ఉత్సహాపరిచారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు  తెలంగాణ భారీ స్పందన వస్తోంది.ఇవాళ ఉదయం (బుధవారం) హైదరాబాద్ కూకట్‌పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది.ఈరోజు భారత జోడో యాత్ర 56వ ​​రోజు.

ఈ తరుణంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, చిత్ర నిర్మాత పూజా భట్ జోడో యాత్రలో తళుక్కున మెరిసింది. ఆమె రాహుల్‌తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యకర్తలను ఉత్సహాపరిచారు. యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌తో ఆమె కాసేపు ముచ్చటించారు. కాసేపు తర్వత వెళ్లిపోయింది. 

గత వారం రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అంతకుముందు గత నెల 29న రాహుల్ పాదయాత్రలో నటి పూనమ్ కౌర్ కూడా యాత్రకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ,పూనమ్ కౌర్‌ల ఫోటో కూడా వైరల్ అయ్యింది, అందులో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కనిపించారు.  

పాదయాత్రలో పూనమ్ కౌర్ చేయిని రాహుల్ గాంధీ పట్టుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. వారి ఫోటోలపై బీజేపీ నేతలు విపరీతంగా ట్రోల్స్ చేశారు.  కాంగ్రెస్ నేతలు కూడా అదే రీతిలో సమాధానమిచ్చారు. గతంలో ప్రధాని మోడీ హీరోయిన్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ..  కాంగ్రెస్ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. వారి చిత్రాన్ని పంచుకుంటూ..కర్ణాటక బీజేపీ నాయకురాలు ప్రీతీ గాంధీ ఇలా రాశారు." ముత్తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నారు!" పేర్కొంది. ఈ ట్వీట్‌పై పూనమ్ కౌర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
  
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు తెలంగాణలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి భారీ స్పందన  వస్తుంది. నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను కవర్ చేసిన యాత్ర తెలంగాణలో ఏడో రోజు యాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. నేడు రాహుల్ ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగర శివార్లలోని శంషాబాద్‌లోని మఠం ఆలయం నుండి పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.  బెంగళూరు-హైదరాబాద్ హైవే గుండా నగరంలోకి ప్రవేశించారు.

ఈ యాత్రలో కాంగ్రెస్ ఎంపీ,యాత్ర సమన్వయకర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధు యాస్కీ గౌడ్, ఇతర నేతలతో పాటు వేలాది మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం బహదూర్‌పురాలో యాత్ర నిలిచిపోయింది. అక్కడ రాహుల్ గాంధీ వివిధ బృందాలతో సమావేశమై భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు.

అనంతరం సాయంత్రం  పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. పురానాపూల్, హుస్సేనీ ఆలం, ఖిల్వత్ మీదుగా చారిత్రక చార్మినార్‌కు చేరుకుంది. చారిత్రాత్మక స్మారక చిహ్నం,హైదరాబాద్‌కు ప్రతీక అయిన చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ నాయకులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఆయన తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశం నుంచి తన తండ్రి రాజీవ్ గాంధీ అక్టోబర్ 19, 1990న 'సద్భావన యాత్ర'ని ప్రారంభించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ప్రతి ఏటా కాంగ్రెస్ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుందని చెప్పారు. ఈసారి అక్టోబర్ 19న ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయామని, అందుకే మంగళవారం జాతీయ జెండాను ఎగురవేసినట్లు రమేష్ తెలిపారు.

ఇదిలా ఉండగా..భారత్ జోడో యాత్ర నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ రోజు  సాయంత్రం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం లింగంపల్లికి పాదయాత్ర చేరుకోనుంది. ఇందిరాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జిల్లాలో పాదయాత్ర చేరుకోనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

శుక్రవారం ఒక్కరోజు విరామంతో నవంబర్ 7 వరకు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఇది రాష్ట్రంలోని 19 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 375 కి.మీ మేర పాదయాత్ర కొనసాగునున్నది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?