లాడ్జిలో వ్యభిచార ముఠా.. ముగ్గురు యువతులతో పాటు, 12మంది అరెస్ట్..

Published : Nov 02, 2022, 11:44 AM IST
లాడ్జిలో వ్యభిచార ముఠా.. ముగ్గురు యువతులతో పాటు, 12మంది అరెస్ట్..

సారాంశం

లాడ్జీలో గుట్టుగా నడిపిస్తున్న వ్యభిచార దందాను పోలీసులు బయటపెట్టారు. ముగ్గురు యువతులతో పాటు 12మంది పురుషులను అరెస్ట్ చేశారు. 

ఒడిశా : నగరంలో గత కొద్ది రోజులుగా రహస్యంగా నడుస్తున్న సెక్స్ రాకెట్ ను ఎస్పీ శరవన్ వివేక్ భగ్నం చేశారు. దీనికి నిర్వహిస్తున్న కేంద్రంపై ఆయనే స్వయంగా మఫ్టీలో దాడి చేయడంతో ముగ్గురు యువతులతో 12 మంది విటులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం బరంపురం పోలీసు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. 

పక్కా సమాచారం మేరకు సోమవారం అర్థరాత్రి తానే స్వయంగా మఫ్టీలో బుల్లెట్ పై బీఎన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బరంపురం టాటా బెంజ్ జంక్షన్ లో ఉన్న తులసీ గెస్ట్ హౌస్ (లాడ్జి)వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడి చేయడంతో పాటు కోల్ కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు 12మంది నిందితులు పట్టుబడగా, అందరినీ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను మంగళవారం బరంపురం  సబ్ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వివరించారు. 

దాగుడుమూతలు ఆడుతూ.. 16 ఏళ్ల బాలిక లిప్టులో ఇరుక్కుని మృత్యువాత..

ఇదిలా ఉండగా, ముంబైలో ఈ జులైలో ఇలాంటి ముఠా గుట్టునే పోలీసులు రట్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా థానే పట్టణంలోవ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిలాల్ కొకాన్ మోరల్ (26) అనే వ్యక్తి థానె, నవి ముంబై, ముంబై, పూణే, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ల నుంచి అమ్మాయిలను  అక్రమంగా తీసుకువచ్చి.. గత కొద్ది రోజులుగా వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందింది.  

వారు వెంటనే థానేలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్ టీసీ) పోలీసులతో కలిసి వలపన్ని బిలాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి మీద ఐపీసీలోని పలు సెక్షన్ లతో పాటుగా మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం థానెలోని కోప్రీ పోలీస్ స్టేషన్ లో బిలాల్ ను ఉంచి..  మరింత సమాచారాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్