
ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ ని బస్తర్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న ఓ జంట మీద ఓ యువకుడు ఆసిడ్ దాడి చేశాడు. దీంతో అప్పటి వరకు సంతోషంతో కలకలలాడిన పెళ్లి మండపం ఒక్కసారిగా హాహా కారాలతో నిండిపోయింది. వధూవరులతో పాటు మరో పదిమంది కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. బస్తర్ జిల్లాలోని భాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చోటే అమబల్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
వివాహం జరుగుతుండగా ఒకసారిగా కరెంటు పోయింది. వెంటనే కరెంటును పునరుద్ధరించాలని చూస్తున్న సమయంలోనే.. దుండగుడు వధూవరుల మీద దాడి చేయడానికి ఇదే అదనుగా భావించాడు. వధూవరులు ఇద్దరి మీద యాసిడ్ పోసాడు. అనుకోని ఈ హఠాత్పరిణామానికి వధూవరులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి చుట్టూ ఉన్న మరో 10 మంది బంధువుల మీద కూడా యాసిడ్ పడింది. వారు కూడా గాయాల పాలయ్యారు. వెంటనే తేరుకున్న మిగతావారు బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హారర్... ‘అతని ఆత్మ నన్ను వెంటాడుతోంది.. పగలు, రాత్రి చిత్రహింసలు పెడుతోంది’...
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా భన్‌పురి ప్రాంతంలోని అంబల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సునీతా కశ్యప్ అనే యువతికి సుధాపాల్ ప్రాంతానికి చెందిన దమ్రు బాఘేల్ అనే యువకుడితో వివాహం నిశ్చయమయ్యింది. బుధవారం వివాహం కావడంతో బంధువులంతా గ్రామానికి చేరుకున్నారు. వధూవరులు సంప్రదాయ వస్త్రధారణలో పెళ్లికి సిద్ధమయ్యారు. అతిథులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పెళ్లి మండపం అంతా సందడిగా ఉంది. ఈ క్రమంలో కరెంట్ పోయింది. హాల్లో నిశ్శబ్దం ఆవరించింది.
కొందరు పవర్ ఆన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి ఒక్కసారిగా లోపలికి వచ్చి వధూవరులపై యాసిడ్ పోసి పారిపోయాడు.వధూవరులతో పాటు దాదాపు పది మందిపై యాసిడ్ పోయడంతో పెద్దగా కేకలు వేశారు. దీంతో హాలులో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో అక్కడికి పరుగులు తీస్తున్నారు. కొద్దిసేపటికి కరెంటు వచ్చి ఏం జరిగిందో అర్థమైంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అదృష్టవశాత్తూ వారందరూ స్వల్ప గాయాలతో బయట పడగా, బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. యాసిడ్ దాడి నిందితుడు వరుడి బంధువుగా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.