దుబాయ్ వేరే దేశం ఎలా అవుతుంది..? కేరళ సీఎం

Published : Aug 23, 2018, 10:09 AM ISTUpdated : Sep 09, 2018, 01:14 PM IST
దుబాయ్ వేరే దేశం ఎలా అవుతుంది..? కేరళ సీఎం

సారాంశం

దుబాయ్‌ను వేరే దేశంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. సాయం కోసం మనం ఆ దేశాన్ని కోరలేదని.. దుబాయ్ తనకుతానుగా కేరళకు వరద సాయాన్ని ప్రకటించిందని తెలిపారు. 

భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో.. కేరళను ఆర్థికంగా ఆదుకునేందుకు యూఏఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేరళ రాష్ట్రానికి రూ.700కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే.. ఈ సాయన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. తాజాగా.. ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు.

కేరళ ప్రజలు యూఏఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని.. దుబాయ్‌ను వేరే దేశంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. సాయం కోసం మనం ఆ దేశాన్ని కోరలేదని.. దుబాయ్ తనకుతానుగా కేరళకు వరద సాయాన్ని ప్రకటించిందని తెలిపారు. 

దేశ నిర్మాణంలో భారతీయులు.. ముఖ్యంగా కేరళ ప్రజలు చేసిన కృషిని, ఆ దేశ పాలకులు గుర్తించారని సీఎం తెలిపారు. ఈ క్రమంలో దుబాయ్‌ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని అన్నారు. కేరళలో పునరావాసానికి దుబాయ్ ప్రకటిచిన సాయాన్ని కేంద్రం ప్రభుత్వం అంగీకరించడం లేదని తెలిపారు. 

అబుదాబి రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నయాన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసి సాయంపై ప్రతిపాదించారని సీఎం విజయన్‌ చెప్పారు. అయితే దుబాయ్ సాయాన్ని తిరస్కరించడంపై స్పందించిన కేంద్రం.. 2004లో ఏర్పాటైన విపత్తు సాయం విధానానికి అనుగుణంగా భారత్‌ వ్యవహరిస్తోందని.. దానికనుగుణంగానే అప్పటి నుంచి విదేశ సాయాన్ని తిరస్కరిస్తూ వస్తోందని స్పష్టం చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు