జేఎంఐ స్టూడెంట్ కు 70లక్షల వేతనం

By sivanagaprasad KodatiFirst Published Aug 22, 2018, 6:25 PM IST
Highlights

శ్రమిస్తే విజయం నీ బానిస అవుతుందన్న నానుడిని నిజం చేశాడు జేఎంఐ కు చెందిన యువకుడు. తన కల సాకారం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు విజయం అతనికి దాసోహం అయ్యింది. ఏకంగా ఏడాదికి 70లక్షల జీతం గల ఓ ఉద్యోగం అతని ఇంటితలుపు తట్టింది. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు అనుకుంటున్నారా....జామియా మిల్లియా ఇస్లామియాకు చెందిన మహమ్మద్ అమీర్ అలీ.  అమీర్ అలీ ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్‌ కొడుకు.  

ఢిల్లీ: శ్రమిస్తే విజయం నీ బానిస అవుతుందన్న నానుడిని నిజం చేశాడు జేఎంఐ కు చెందిన యువకుడు. తన కల సాకారం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు విజయం అతనికి దాసోహం అయ్యింది. ఏకంగా ఏడాదికి 70లక్షల జీతం గల ఓ ఉద్యోగం అతని ఇంటితలుపు తట్టింది. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు అనుకుంటున్నారా....జామియా మిల్లియా ఇస్లామియాకు చెందిన మహమ్మద్ అమీర్ అలీ.  అమీర్ అలీ ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్‌ కొడుకు.  

జేఎంఐలో బీటెక్ చెయ్యాలని అతని కోరిక. అందుకు మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టుదలతో ముందుకు సాగాడు. ఎలాగైనా తన లక్ష్యాన్నిచేరుకోవాలని పరితపించాడు. అతని శ్రమకు తగిన ఫలితం వచ్చింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ భారీ ప్యాకేజీతో  అతని ముంగిట వాలింది. ఆ విద్యార్థి ప్రతిభను వదులు కోలేక భారీ ప్యాకేజీతో తన కంపెనీలోకి నియమించుకుంది.  

జేఎంఐ స్కూల్‌ బోర్డు పరీక్షల్లో అలీ మంచి మార్కులు సాధించాడు. కానీ మూడేళ్ల పాటు బీటెక్‌ కోర్స్‌లో సీటు దొరకలేదు. తొలి ప్రయత్నంలో నిరాశ. ఆ తర్వాత జరిగగిన రెండేళ్లు సీటు దొరకలేదు. అయినా పట్టువిడవలేదు. మూడుసార్లు విఫలమైన తర్వాత అలీ ఆశలకు కాస్త ఊరటనిస్తూ జేఎంఐలో డిప్లొమాలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అర్హత లభించింది.

 జేఎంఐలో సీటు దక్కించుకున్న అలీ నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనుకున్నాడు. భవిష్యత్తు తరం వారికి ఉపయోగపడే ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రాజెక్ట్‌ వర్క్‌చేయడం ప్రారంభించాడు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సరియైన ఛార్జింగ్‌ సదుపాయాలు లేవు. దానిపై దృష్టిసారించాడు అలీ. అలీ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట.

 అలీ చేస్తున్న ప్రాజెక్ట్‌ను అమెరికా కంపెనీ ఫ్రిసన్‌ మోటార్ వ్రెక్స్‌ గుర్తించింది. జేఎంఐ వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్ట్‌ వర్క్‌ను చూసిన ఫ్రిసన్‌ వెంటనే యూనివర్సిటీ అధికారులను సంప్రదించింది. స్కైప్‌, టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూల ద్వారా నెల పాటు అలీతో నిరంతరం కమ్యూనికేషన్‌ జరిపింది. అతని ప్రతిభను గుర్తించిన కంపెనీ 1,00,008 డాలర్లు అంటే ఏడాదికి 70 లక్షల రూపాయల వేతనం ఇస్తూ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇంజనీర్‌గా తన కంపెనీలోకి నియమించుకుంది.  

ఒక జామియా విద్యార్థికి ఇంత వేతనంతో ఉద్యోగం దొరకడం ఇదే తొలిసారి. జేఎంఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ అని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. అలీ తండ్రి శంషాద్ అలీ జేఎంఐలోనే ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ పరికరాలు ఎలా పనిచేస్తాయని తనను చాలాసార్లు అలీ అడుగుతుండే వాడని శంషాద్‌ గుర్తు చేశారు. 
 

click me!