రాఫెల్‌పై నోర్మూయండి....కాంగ్రెస్‌ కు అనిల్ అంబానీ వార్నింగ్

By sivanagaprasad KodatiFirst Published Aug 22, 2018, 5:26 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సీరియస్ అయ్యారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక నోరు మూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు కోసం రిలయన్స్ డిఫెన్స్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుందని కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. 
 

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సీరియస్ అయ్యారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక నోరు మూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు కోసం రిలయన్స్ డిఫెన్స్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుందని కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. 

రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ పూర్తి వివరాలను రిలయన్స్ డిఫెన్స్  పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నేరుగా రెండు లేఖలు పంపింది. అయినా రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తుండటంతో కాంగ్రెస్ నేతలకు రిలయన్స్ ఢిఫెన్స్ నుంచి లీగల్ నోటీసులు పంపారు. 

జాతీయ కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్‌కు  నోటీసులు పంపిన రిలయన్స్ డిఫెన్స్ ఒప్పందంలో ధృవీకరించని విషయాలను ఊటంకిస్తూ పనిమాలిన, అపవాదు ప్రకటనలు చేయడం ఆపేయాలి అని తీవ్ర పదజాలంతో ఆ లేఖలో పేర్కొన్నారు.
 
రిలయన్స్ డిఫెన్స్ గురించి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను ఆపివేయాలని షెర్గిల్‌కు, కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. తన గురించి తన సంస్థ గురించి రణ్‌దీప్ సూర్జేవాలా, అశోక్ చవాన్, సంజయ్ నిరూపమ్, అభిషేక్ మను సింఘ్తీ ఇతర కాంగ్రెస్ నేతలు తప్పుడు, పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అనిల్ అంబానీ మండిపడ్డారు. 

తనకు తమ కంపెనీకి భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం స్పందించడం లేదని తెలిపారు. 

రాఫెల్ వివాదంపై తమ సంస్థ కోర్టును ఆశ్రయించనుందని కాంగ్రెస్ పార్టీకి పంపిన నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రతి అంశంపై తాము న్యాయవ్యవస్థలో పోరాటం చేయనున్నట్లు అనిల్ అంబానీ తెలిపారు. రాజకీయ నాయకులకు భావప్రకటనా స్వేచ్ఛపై హక్కు ఉంది. దేశాన్ని ప్రభావితం చేసే అంశాలపై స్పందించాలి. అయితే అవి బాధ్యతాయుతంగా ఉండాలి అని సూచించారు. 

తమ సంస్థ ఖ్యాతిని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రత్యర్థి కార్పొరేటర్ల ఆదేశాల మేరకే ఆ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

click me!