బాలాకోట్‌ దాడుల హీరోకు ప్రమోషన్.. ఇక గ్రూప్ కెప్టెన్‌గా అభినందన్ వర్థమాన్

By Siva KodatiFirst Published Nov 3, 2021, 8:06 PM IST
Highlights

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (pak occupied kashmir) (pok)లోని బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై (balakot air strikes) భారత వైమానిక దళం (indian air force) (ఐఏఎఫ్‌) జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో హీరోగా అవతరించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను (abhinandan varthaman) ఐఏఎఫ్‌ ప్రమోట్ చేసింది

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (pak occupied kashmir) (pok)లోని బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై (balakot air strikes) భారత వైమానిక దళం (indian air force) (ఐఏఎఫ్‌) జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో హీరోగా అవతరించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను (abhinandan varthaman) ఐఏఎఫ్‌ ప్రమోట్ చేసింది. ఆయనను గ్రూప్ కెప్టెన్‌గా (group captain) ప్రమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత వైమానిక దళంలోని గ్రూప్ కెప్టెన్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో (indian army) కల్నల్‌ ర్యాంక్‌తో సమానం.

2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని (jammu kashmir) పుల్వామాలో (pulwama attack) సీఆర్పీఎఫ్‌ (crpf) జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జవాన్లు అమరులుకాగా, పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న భారత వాయుసేన మెరుపు దాడులకు తెగబడింది. బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చివేసింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు.

Also Read:శాంతి కోసమే, మాపై ఒత్తిడి లేదు: అబినందన్ విడుదలపై పాకిస్తాన్

అయితే పాకిస్తాన్ సైతం అత్యాధుక ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలో మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడుపుతున్న అభినందన్, పాక్‌కు చెందిన ఒక ఎఫ్‌-16ను కూల్చివేశారు. ఈ సందర్భంగా కూలిపోతున్న మిగ్‌-21 నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే దురదృష్టవశాత్తూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన ఆయనను పాక్‌ ఆర్మీ నిర్బంధించింది. అభినందన్‌ను సురక్షితంగా తమకు అప్పగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్‌‌తో పాటు అంతర్జాతీయ జోక్యంతో పాక్‌ దిగివచ్చింది. అదే రోజు రాత్రి అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత సైనిక అధికారులకు పాకిస్తాన్ అప్పగించింది. అసమాన సాహసాన్ని ప్రదర్శించిన అభినందన్‌ను భారత ప్రభుత్వం శౌర్య చక్ర (shaurya chakra) అవార్డుతో సత్కరించింది. తాజాగా గ్రూప్ కెప్టెన్ ర్యాంక్‌కు ఐఏఎఫ్‌ ప్రమోట్ చేసింది.

click me!