ఐఎస్ఐ అడుగుజాడల్లో అఖిలేష్‌.. అందుకే జిన్నాపై ప్రశంసలు: యూపీ మంత్రి సంచలన ఆరోపణలు

Siva Kodati |  
Published : Nov 03, 2021, 04:42 PM IST
ఐఎస్ఐ అడుగుజాడల్లో అఖిలేష్‌.. అందుకే జిన్నాపై ప్రశంసలు: యూపీ మంత్రి సంచలన ఆరోపణలు

సారాంశం

సమాజ్‌వాది పార్టీ చీఫ్ (samajwadi party) , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై (akhilesh yadav) ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా (anand swaroop shukla) సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (isi) నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం అందుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (uttar Pradesh assembly polls) సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్ (samajwadi party) , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై (akhilesh yadav) ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా (anand swaroop shukla) సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (isi) నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం అందుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముస్లీంల ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తన మతాన్ని మార్చుకున్నా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని శుక్లా అన్నారు. 

ఇస్లామిక్ ప్రపంచానికి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) ముప్పుగా పరిణమించారని.. అందుకే అఖిలేష్ యాదవ్‌కు వారి నుంచి పూర్తి మద్ధతు లభిస్తోందని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఓడించేందుకు ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు సలహాలు సూచనలు అందుతున్నట్లు పేర్కొన్నారు. పాక్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నాపై ఆదివారంనాడు అఖిలేష్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించిన నేపథ్యంలో మంత్రి శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లీంల మెప్పు కోసం అఖిలేష్ యాదవ్ నమాజ్ చేశారు..ఉపవాస దీక్షలు చేశారు.. అవసరమైతే ముస్లీం మతాన్ని స్వీకరించేందుకు కూడా ఆయన వెనుకాడరంటూ మంత్రి శుక్లా ఆరోపించారు. ఐఎస్ఐ సూచనల మేరకే అఖిలేష్ యాదవ్ జిన్నాను మెచ్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం గర్హనీయమన్నారు. 

Also Read: జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’

కాగా.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ Pakistan జాతిపితగా భావించే Muhammad Ali Jinnahను ప్రస్తావించారు. భారత స్వాతంత్ర్య సమర యోధులతోపాటుగా ఆయన పేరును పేర్కొన్నారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, జిన్నాలు ఒకే విద్యా సంస్థలో చదువుకున్నారని వివరించారు. వారంతా బారిస్టర్‌లు అయ్యారని తెలిపారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని అన్నారు. ఇదే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్‌ పైనా విమర్శలు చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (vallabhbhai patel) ఒక భావజాలాన్ని నిషేధించారని గుర్తుచేశారు. దేశాన్ని మతం, కులాల ఆధారంగా ఆ భావజాలం విభజిస్తుందని ఆయన పసిగట్టారని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం