ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద అనుమానాస్పద కారు, భారీగా పేలుడు పదార్ధాలు

Siva Kodati |  
Published : Feb 25, 2021, 08:38 PM ISTUpdated : Feb 25, 2021, 08:39 PM IST
ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద అనుమానాస్పద కారు, భారీగా పేలుడు పదార్ధాలు

సారాంశం

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో గురువారం కలకలం రేగింది. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో గురువారం కలకలం రేగింది. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.

అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అంబానీ ఇంటికి పోలీసులు, డాగ్ స్క్వాడ్ చేరుకొన్నాయి. అనంరం ఆ వాహనాన్ని ఎవరు అక్కడ పార్క్‌ చేశారు, తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్టుగా గుర్తించారు. ఇందుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  
 

PREV
click me!

Recommended Stories

Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Future of Jobs : డిగ్రీ హోల్డర్స్ Vs స్కిల్ వర్కర్స్ ... ఎవరి సంపాదన ఎక్కువో తెలుసా..?