శివకాశీ: టపాసుల కేంద్రంలో ఘోర ప్రమాదం, ఆరుగురు సజీవ దహనం

By Siva KodatiFirst Published Feb 25, 2021, 7:43 PM IST
Highlights

తమిళనాడులోని శివకాశీలో మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, 14 మందికి గాయపడ్డారు. 

తమిళనాడులోని శివకాశీలో మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, 14 మందికి గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలోని ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కేంద్రంలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అక్కడ భారీ స్థాయిలో పేలుడు సంభంవించింది. ఈ ఘటనలో తయారీ కేంద్రంలోని పది గదులు కుప్పకూలాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి.

శరీరాలు గుర్తుపట్టని విధంగా కాలిపోవడంతో మృతులు వివరాలు తెలియరాలేదు. అయితే పోలీసులు, అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకున్న తర్వాత కూడా వరుసగా పేలుళ్లు జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

click me!