రూ.100 టికెట్టుపై రూ. కోటి రూపాయల ప్రైజ్ కొట్టేసిన గృహిణి

Published : Feb 25, 2021, 07:58 PM ISTUpdated : Feb 25, 2021, 08:05 PM IST
రూ.100 టికెట్టుపై రూ. కోటి రూపాయల ప్రైజ్ కొట్టేసిన గృహిణి

సారాంశం

పంజాబులోని అమృతసర్ కు చెందిన ఓ సాధారణ గృహిణి బంపర్ బహుమతిని గెలుచుకుంది. వంద రూపాయల టికెట్టుపై కోటి రూపాయల ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

అమృతసర్: పంజాబ్ లోని అమృతసర్ లో గల ఓ గృహిణి బంపర్ ప్రైజ్ కొట్టేసింది. రూ.100 విలువ చేసే టికెట్ కొనుగోలు చేసిన ఆమెకు రూ.1 కోటి రూపాయల లాటరీలో ప్రథమ బహుమతి లభించింది. 

ప్రైజ్ మనీ కోసం లక్కీ విన్నర్ రేణు చౌహాన్ గురువారంనాడు టికెట్టును, అవసరమైన పత్రాలను రాష్ట్ర లాటరీల శాఖకు సమర్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ బహుమతి మధ్య తరగతి కుటుంబమైన తమకు ఎంతో ఊరట కలిగించిందని రేణు చౌహాన్ అన్నారు. అమృతసర్ లో తన భర్త బట్టల దుకాణం నడుపుతుంటాడని, ఈ బంపర్ ప్రైజ్ తమకు ఎంతో ఊరట కలిగిస్తుందని, జీవితాన్ని సాఫీగా సాగించడానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.  

పంజాబ్ రాష్ట్రం డియర్ 100 +  నెలసరి లాటరీ డ్రాను ఫిబ్రవరి 11వ తేదీన తీసింది. , ఈ విషయాన్ని పంజాబ్ రాష్ట్ర లాటరీల శాఖ తెలిపింది. ప్రైజ్ మనీని రేణు చౌహన్ ఖాతాకు త్వరలోనే బదిలీ చేస్తామని సంబంధిత అధికారులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Future of Jobs : డిగ్రీ హోల్డర్స్ Vs స్కిల్ వర్కర్స్ ... ఎవరి సంపాదన ఎక్కువో తెలుసా..?