ఢిల్లీ, పంజాబ్‌లోని పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం: అరవింద్ కేజ్రీవాల్

Published : Feb 11, 2023, 08:06 PM IST
ఢిల్లీ, పంజాబ్‌లోని పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం: అరవింద్ కేజ్రీవాల్

సారాంశం

New Delhi: ఢిల్లీ, పంజాబ్ పాఠశాలలను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామ‌ని ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  

Delhi Chief Minister Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని ప్రభుత్వాలకు విద్యే ప్రాధాన్యమనీ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత‌ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

 

ఆప్ ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఢిల్లీలో విద్యావ్యవస్థను మెరుగుపరచడం, చక్కదిద్దడం వంటి అంశాలు కష్టమని కేజ్రీవాల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, త‌మ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతూ మెరుగైన ఫ‌లితాలు సాధిస్తున్న‌ద‌ని తెలిపారు. తొలుత మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామనీ, ఆ తర్వాత ఆప్ ప్రభుత్వం టీచర్లు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించిందని చెప్పారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ప్రోత్సహించనంత వరకు ఆ ప్రభావం కనిపించదన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు క‌లిసి శ‌నివారం నాడు ఒక కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. త‌మ పాల‌న‌లో ఉన్న ఢిల్లీ, పంజాబ్ లలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే, ఆప్ ప్రభుత్వం  విద్య‌-ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్ప‌ష్టం చేశారు. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. పంజాబ్ లో ఉపాధ్యాయులు బోధన తప్ప మరే పనిలోనూ నిమగ్నం కాబోరని చెప్పారు.

 

ఢిల్లీ, పంజాబ్ లోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ కూడా ప్రయోగాలు చేస్తుందనీ, ఢిల్లీ దాని నుంచి పాఠాలు నేర్చుకుంటుందని ఆప్ చీఫ్ అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు సింగపూర్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్న పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బృందం ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు ఇరు దేశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి ఇలాంటి ఫీడ్ బ్యాక్ సెషన్ నిర్వహించడం బహుశా ఇదే మొదటిసారని చెప్పారు.

ఫిబ్రవరి 4న సింగపూర్ లో ప్రొఫెషనల్ టీచర్ ట్రైనింగ్ సెమినార్ లో పాల్గొనే 36 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మొదటి బ్యాచ్ ను పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ పరీక్షకు హాజరుకానీ, పరీక్షలపై సలహాలు ఇచ్చే నాయకులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !