
ఆధార్ కార్డ్.. ఈ కార్డు లేకపోతే మనం ఇప్పుడు ఏ పని చేయలేము. ఎలాంటి సంక్షేమ పథకానికి అప్లయ్ చేసుకోవాలన్నా.. ఏదైనా ఉన్నత విద్య చదవాలి అనుకున్నా.. ఇన్ కమ్ సర్టిఫికెట్ తీయాలనుకున్నా.. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా.. పాన్ కార్టు పొందాలన్నా.. ఇప్పుడు కొత్తగా ఓటర్ కార్డు పొందాలనుకున్నా ఈ కార్డ్ కచ్చితంగా కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ పనిలో దీని అవసరం ఉంది. ఈ ఆధార్ కార్డు దాదాపు ఇండియాలో ఉండే ప్రతీ ఒక్క పౌరునికి అవసరమే. అయితే ఈ కార్డులు జారీ చేసే సంస్థ ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా మందికి ఉపయోగకరంగా ఉండనుంది.
హాస్పిటల్‌లోనే నమోదు..
ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డ్ అవసరం అవుతోంది. పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ప్రస్తుతం చిన్న పిల్లల ఆధార్ కార్డు పొందటం కొంత కష్టంగానే ఉంది. చిన్నారులు పుట్టిన హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, మళ్లీ దాని ద్వారా మీ సేవాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వారు అందించే ఆ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. తరువాత స్థానిక పంచాయతీ సెక్రటరీ లేదా ఇతర రెవెన్యూ ఆఫీసర్ సంతకం తీసుకొని ఆధార్ సెంటర్ కు వెళ్లాలి. అక్కడ గంటలు గంటలు నిరీక్షించి ఆధార్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలి. ఆ సమయంలో పిల్లలు కూడా చాలా సందర్భాల్లో సహకరించరు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ (UIDAI) ఒక గొప్ప ముందడుగు వేసింది. హాస్పిటల్‌లో శిశువు పుట్టిన వెంటనే వారికి ఆధార్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం బర్త్ రిజిస్ట్రార్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందం గనుక కుదిరితే ఇక పిల్లల ఆధార్ కార్డుకు కోసం ఎక్కడికీ తిరగాల్సిన పని ఉండదు. హాస్పిటల్ పుట్టిన వెంటనే ఆధార్ కార్డుకు రిజిస్ట్రేషన్ అయినపోతుంది. తరువాత కొన్ని రోజులకు ఆధార్ కార్డు చేతికి అందుతుంది. దాని ద్వారా మనకు అవసరమైన అన్ని పనులు చేసుకోవచ్చు.
ఇప్పటికీ ఆ రెండు దేశాల్లో కరోనా టీకాలు వేయట్లేదు.. ఎరిత్రియా కథ ఇదీ
ఈ విషయంలో యూనిక్ ఐడెంటివిఫకేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ముఖ్య అధికారి సౌరభ్ గార్గ్ వివరాలు వెళ్లడించారు. ఇప్పటి వరకు దేశంలోని 131 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశామని తెలిపారు. అంటే దాదాపు 99 శాతం మందికి ఇంత వరకు ఆధార్ చేరుకుందని అన్నారు. ఇక మిగిలింది కొత్తగా పుట్టే వారికి ఆధార్ కార్డు ఇవ్వడమే అని తెలిపారు. వారికి కూడా ఆధార్ కార్డు జారీ చేసేందుకు కొత్త ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ రోజు కొన్నివందల సంఖ్యలో జననాలు జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వారందరికీ హాస్పిటల్‌లోనే ఆధార్ కార్డు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. శిశువు జన్మించిన వెంటనే అక్కడికి వెళ్లి ఒక ఫొటో తీసుకుంటామని చెప్పారు. మిగితా వివరాలు సేకరించి అప్పుడే వారికి ఆధార్ కార్డు అందజేస్తామని అన్నారు. అయితే వారికి ఐదేళ్ల వరకు ఎలాగూ బయోమెట్రిక్ అవసరం ఉందని తెలిపారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ శిశువుల భవిష్యత్ అవరసరాల కోసం తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డుకు ఆ పిల్లల లింక్ చేస్తామని అన్నారు. మళ్లీ ఐదేళ్ల తరువాత బయోమెట్రిక్ అప్ డేట్ చేయిస్తే సరిపోతుందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి మార్పులు అవసరం లేకుంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదని అన్నారు. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.