తమిళనాడులో విషాదం: ప్రైవేట్ స్కూల్‌లో బాత్‌రూమ్ గోడకూలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

By narsimha lodeFirst Published Dec 17, 2021, 3:59 PM IST
Highlights

తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ లో బాత్ రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ  10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 3 లక్షలు  ఇచ్చింది.

చెన్నై: Tamilnadu లోని Thirunelveli జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బాత్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు Schaffter Higher Secondary school లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే  రెస్క్యూ బృందం సంఘటన స్థలానికి చేరుకొని  సహాయక చర్యలు చేపట్టారు.గోడ కూలిపోవడంతో 9వ తరగతి చదివే అన్భళగన్, ఎనిమిదవ తరగతి చదివే విశ్వరంజన్, ఆరో తరతతి చదివే సుతేష్ లు మరణించారు. సంజయ్(8వతరగతి), ప్రకాష్ (9వ తరగతి),. షేక్ అబూబకర్ కిదానీ( 12వ తరగతి) అబ్దుల్లా (7వ తరగతి) లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ సానుఃభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు  ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సీఎం. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలను ప్రభుత్వం ప్రకటించింది.  ఈ ఘటనపై  రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరమన్నారు. ఈ పాఠశాలను తక్షణమే తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న స్కూల్లో బిల్డింగ్స్, గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే వీటిని మరమ్మత్తులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. 

click me!