పెళ్లి చేసుకుంటానని యువతి మతం మార్చినందుకు ముస్లిం యువకుడి అరెస్టు.. ఎక్కడంటే ?

Published : Oct 15, 2022, 01:35 PM IST
పెళ్లి చేసుకుంటానని యువతి మతం మార్చినందుకు ముస్లిం యువకుడి అరెస్టు.. ఎక్కడంటే ?

సారాంశం

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ హిందూ యువతి మతం మార్చాడు ఓ ముస్లిం యువకుడు. దీనిపై బాధిత యువతి తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం కింద మొదటి అరెస్టు జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి 19 ఏళ్ల యువతిని ఓ 24 ఏళ్ల ముస్లిం యువకుడు మతం మార్చాడు. దీంతో అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అక్టోబర్ 5వ తేదీన 19 ఏళ్ల యువతి అదృశ్యం కావడంతో ఆమె తల్లి యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రపంచ ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్.. 101 నుంచి 107వ స్థానానికి..

ఈ ఘటనపై బాధితురాలి తల్లి అక్టోబర్ 6వ తేదీన ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో అక్టోబరు 8వ తేదీన సయ్యద్ మొయిన్‌ అనే వ్యక్తిని మహిళను పోలీస్ స్టేషన్‌లో విచారించారు. దీంతో తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో మతంలోకి మార్చాడని బాధితురాలి తల్లి అక్టోబర్ 13న మళ్లీ ఫిర్యాదు చేసింది.

డాక్టర్ కే మత్తు ఇంజక్షన్, అడ్డుగా ఉన్నాడని మాజీ భార్య ఘాతుకం.. 33 రోజులపాటు కోమాలో ఉండి మృతి..

ఆమె ఫిర్యాదు మేరకు కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు చట్టంలోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

కాలేజీ స్టూడెంట్ పై ఆటో డ్రైవర్ అఘాయిత్యం.. చేతులు పట్టుకొని 500 మీటర్లు లాక్కెళ్లిన వైనం.. వీడియో వైరల్.. 

సెప్టెంబరు 30న కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా బాధిత వ్యక్తి, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి లేదా రక్త సంబంధీకులు, దత్తత తీసుకున్న వ్యక్తులు, వివాహం చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ప్రథమ సమాచారాన్ని నమోదు చేయవచ్చు. సెక్షన్-3లోని నిబంధనలకు విరుద్ధమైన ఇలాంటి మత మార్పిడిని నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం జైలు శిక్ష విధిస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్