మరణించిన ప్రియురాలిని పెళ్లాడిన యువకుడు.. మళ్లీ వివాహం చేసుకోబోనని ప్రమాణం.. సోషల్ మీడియాలో వైరల్..

By team teluguFirst Published Nov 20, 2022, 7:25 AM IST
Highlights

అనారోగ్యంతో చనిపోయిన యువతి మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రియురాలు మరణించడంతో మృతదేహాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇది అస్సాంలో చోటు చేసుకుంది. 

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ యువతి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యింది. దీంతో ఆమె చనిపోయింది. కానీ ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకే మొగ్గు చూపాడు. మృతదేహానికి తాళి కట్టాడు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాశీ-తమిళనాడు రెండూ సంస్కృతి, నాగరికతకు శాశ్వత కేంద్రాలు: ప్రధాని మోడీ

అస్సాం రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్‌ జిల్లాలో నివాసం ఉంటున్న బితుపాన్, చపర్‌ముఖ్‌లోని కొసువా గ్రామానికి చెందిన ప్రార్థన బోరా చిరకాల ప్రేమికులు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. పెళ్లికి కూడా అనుమతి ఇచ్చారు. వివాహం చేసుకునేందుకు ప్లాన్ కూడా చేసుకున్నారు. 

కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్

అయితే ప్రార్థనా కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆ యువతి పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం రాత్రి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు బితుపాన్ గుండె పగిలేలా ఏడ్చాడు. కానీ ఆమెనే పెళ్లిచేసుకోవాలని భావించాడు. వారి సంప్రదాయం ప్రకారం వివాహ ప్రక్రియను పూర్తి చేశాడు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: వాపిలో ప్రధాని మోడీ రోడ్‌షో.. కిక్కిరిసిన జనం

దీనిని ప్రార్థన సోదరుడు సుభోన్ మాట్లాడుతూ.. ‘‘ బిపుతాన్ మా దగ్గరి వచ్చి ప్రార్థనను వివాహం చేసుకోబోతున్నానని చెప్పాడు. ఇది మా ఊహకు అందలేదు. నా సోదరిని అతడు ఇంత గాఢంగా ప్రేమిస్తారని మేము కలలో కూడా ఊహించలేదు. మేము అతడిని ఆపడానికి ప్రయత్నించలేకపోయాము.’’ తెలిపారు. ‘‘ అంత్యక్రియల సమయంలో అతడు మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు. నా సోదరి నిజంగా అదృష్టవంతురాలు. ఆమె బిపుటన్‌ను వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆ వ్యక్తి ఆమె చివరి కోరికను నెరవేర్చాడు. ’’ అని తెలిపారు. కాగా.. 
ఈ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు చేసిన పనిని సోషల్ మీడియా యూజర్లు ప్రశంసిస్తున్నారు. 

click me!