పెళ్లి కోసం రూ. కోటి ఖర్చు చేసి లింగమార్పిడి చేసుకున్న యువకుడు.. తీరా మోసం చేయడంతో.. (వీడియో)

By Sairam Indur  |  First Published Mar 6, 2024, 5:32 PM IST

ఓ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు మరో యువకుడు లింగమార్పిడి చేసుకున్నాడు. దానికి భారీగా ఖర్చు అయ్యింది. ఆపరేషన్ పూర్తయిన తరువాత పెళ్లి చేసుకోవాలని కోరితే ఆ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో బాధితుడు ఏం చేశాడంటే ?


వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. కొంత కాలం తరువాత వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో కలిసి జీవించాలని అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఇద్దరూ యువకులు కావడంతో అది సాధ్యం కాదని భావించారు. దీంతో ఒకరు లింగమార్పిడి చేసుకోవాలని భావించారు. దీంతో ఓ యువకుడు రూ.కోటి వరకు ఖర్చు చేసుకొని లింగమార్పిడి చేసుకున్నాడు. తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకుందామని కోరగా.. దానికి ఆ యవకుడు నిరాకరించాడు. దీంతో లింగమార్పిడి చేసుకున్న బాధితుడు ఏం చేశాడంటే ? 

ఆ వ్యక్తి ఆచూకీ చెబితే రూ. 10 లక్షలిస్తాం - ఎన్ఐఏ ప్రకటన.. ఇంతకీ ఎవరతను ?

Latest Videos

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 28 ఏళ్ల యువకుడికి యూపీలోని కాన్పూర్ కు చెందిన మరో యువకుడికి 2021లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంత కాలం తరువాత వారిద్దరూ దగ్గరయ్యారు. లింగమార్పిడి చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని కాన్పూర్ యువకుడు హామీ ఇచ్చాడు. దీంతో ఇండోర్ కు చెందిన యువకుడు నమ్మాడు. 

(2/2)pic.twitter.com/Ha1btgxtgh

— Ghar Ke Kalesh (@gharkekalesh)

దాదాపు రూ.1 కోటి ఖర్చు చేసుకొని ఆపరేషన్ ల ద్వారా లింగమార్పిడి చేసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని తన స్నేహితుడిని కోరాడు. దానికి అతడు నిరాకరించాడు. దీంతో పాటు బాధితుడిపై అసహజ చర్యలకు పాల్పడ్డాడు. ఇచ్చిన మాట తప్పడంతో పాటు అనైతిక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కాన్పూర్ యువకుడు కొంత కాలం కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఓటింగ్ సమయంలో వేలికి పూసే సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా ? దాని ప్రత్యేకతలేంటంటే ? 

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు కొనసాగుతున్న సమయంలోనే బాధితుడు తీవ్ర ఆగ్రహంతో నిందితుడి ఇంటికి వెళ్లాడు. ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్న కారుపై పెట్రోల్ పోశాడు. అనంతరం నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

click me!