దీపావళి 2023 : అక్రమంగా వేటకు వెళ్లి.. జింక అనుకుని స్నేహితుడిని కాల్చి...

By SumaBala Bukka  |  First Published Nov 16, 2023, 1:33 PM IST

తమిళనాడులోని తిరువణ్ణామలై అడవికి ఆనుకుని ఉంది. ఇక్కడ తరచుగా ఏనుగుల దాడులు ఘటనలు వెలుగు చూస్తుంటాయి.


తమిళనాడు : జింకలను వేటాడటం భారతదేశంలో నిషేధం. అయినా కూడా తాగిన మత్తులోనో.. వేట మీదున్న మోజులోనో తప్పులు చేయకుండా మానరు. అలాగే చేయబోయాడు ఓ వ్యక్తి. దీపావళికి పార్టీ చేసుకోవడానికి జింకను వేటాడాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి దగ్గరున్న అడవిలోకి వెళ్లారు. అక్కడే అనుకోని సంఘట జరిగింది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ దొరికిపోయారు. 

తమిళనాడులో స్నేహితుడి చేతిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన శక్తివేల్, ప్రకాష్, శక్తివాసన్ ముగ్గురు స్నేహితులు దీపావళి 'పార్టీ' కోసం జింకలను వేటాడేందుకు బయలుదేరారు. దీపావళి పార్టీలో జింక మాంసం మాత్రమే తినాలని ప్లాన్ చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలై అడవికి ఆనుకుని ఉంది. ఇక్కడ తరచుగా ఏనుగుల హింసాత్మక మారడం, దాడులు ఘటనలు వెలుగు చూస్తుంటాయి. 

Latest Videos

చంద్రయాన్-3 : అదుపుతప్పి భూ వాతావరణంలోకి వచ్చిన లాంచింగ్ రాకెట్ విడి భాగం.. ఇస్రో

ఆ అడవిలోకి వెళ్ళిన స్నేహితులకు జింక కనిపించింది. ఇంకేముంది.. జింకను చూడగానే శక్తివాసన్ గన్ ట్రిగ్గర్ నొక్కాడు. అయితే, అది మాయ జింకలా ఉంది. వెంటనే తప్పించుకుంది. ఆ స్థానంలో గన్ లోనుంచి బైటికి వచ్చిన బుల్లెట్ అతని స్నేహితుడైన శక్తివేల్ కు తగిలింది. దీంతో శక్తివేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో స్నేహితుడైన ప్రకాష్ ముఖంపై గాయాలయ్యాయి.

అనుకోని ఈ పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, విషయం శక్తివేల్ కుటుంబసభ్యులకు తెలిపారు. శక్తివేల్ బంధువులు పోలీసులకు లేదా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఖననం చేయడానికి ప్రయత్నించారు. కానీ, తెల్లవారుజామున జమునమరతుర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువణ్ణామలై కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
 

click me!