ఓ భార్యా బాధితుడు పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నాడు. తనను భార్య ప్రతీ రోజూ చిత్ర హింసలు పెడుతోందని, కర్రలతో కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన యూపీలోని మీరట్ లో వెలుగులోకి వచ్చింది.
భార్య బారి నుంచి తనను కాపాడాలని ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను భార్య చిత్ర హింసలు పెడుతోందని, దయ లేకుండా ప్రవర్తిస్తోందని గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఐమాక్స్ లో అర్థరాత్రి గందరగోళం.. టికెట్ డబ్బులు ఇచ్చేయాలంటూ ప్రేక్షకుల ఆందోళన.. ఏం జరిగిందంటే ?
మీరట్ సిటీలోని మేవ్ గఢీ పోలీసు స్టేషన్ కు నదీం అనే యువకుడు ఇటీవల తలకు కట్టుతో, శోకాలు పెడుతూ, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు చెప్పిన విషయాలు విని, చేసిన ఫిర్యాదు చేసి పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తనను భార్య షబ్నం ప్రతీ రోజూ చిత్ర హింసలకు గురి చేస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. రక్తం వచ్చేలా కొడుతోందని బాధను ఏకరువు పెట్టుకున్నాడు. తనను ఓ మనిషిలా కూడా చూడటం లేదని చెప్పాడు.
Gaganyaan Mission: గగన్ యాన్ మిషన్ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ పై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ ఎమన్నారంటే..?
గత బుధవారం రాత్రి తాను ఇంట్లో నిద్రపోతూ ఉన్నానని, అర్థరాత్రి దాటిన తరువాత ఓ కర్రతో చితకబాదిందని రోదిస్తూ చెప్పాడు. నొప్పితో తాను కళ్లు తెరిచానని, ఆ సమయంలో ఆమె యాసిడ్ పోసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపాడు. దీంతో తాను భయంతో బయటకు పరుగులు తీశానని చెప్పాడు. అయినా వదలకుండా కర్ర పట్టుకొని తనను వెంబడించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిపాడు. అతడి గోడు మొత్తం పోలీసులు ఓపికగా విన్నారు. బాధితుడి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరుపుతామని, అవన్నీ వాస్తవాలని తేలితే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.