
ఆ మహిళకు కొన్నేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంత కాలం కిందట ఆమె తన భర్త నుంచి విడిపోయింది. వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి కూతురుకు బుద్ది చెప్పారు. భర్త వద్దకు తీసుకొచ్చి, వారిద్దరికి నచ్చజెప్పి వెళ్లారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ మహిళ అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది.
ఎన్ఈపీని ‘నాగ్‌పూర్ విద్యా విధానం’గా మార్చారు - కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్
ఈ ఘటన తమిళనాడులో రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 36 ఏళ్ల బాబు ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఆయన తిరువళ్లూరు డిస్ట్రిక్ట్ ఎరుమైవెట్టిపాళ్యం గ్రామానికి చెందిన వ్యక్తి. అతడికి కొన్ని సంవత్సరాల కిందట అముద (30) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 10 ఏళ్ల కూతురు జయశ్రీ, ఏడేళ్ల కుమారుడు కిషోర్ ఉన్నారు.
అముద తన భర్త నుంచి కొంత కాలం కిందట విడిపోయింది. అదే ఏరియాలో ఉన్న జగదీశ్వరన్ అనే మరో వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటోంది. అయితే ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆమె వద్దకు వచ్చారు. ఇలాంటి పనులు మంచివి కావని అముదను మందలించారు. ఆమెకు నచ్చజెప్పి 20 రోజుల కిందట భర్త ఇంటికి తీసుకొచ్చారు. భర్త బాబును,అముదను కూర్చొబెట్టి వారిద్దరికి నచ్చజెప్పారు. కలిసి ఉండాలని సూచించారు. అనంతరం వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు.
మా అధికారులను వేధిస్తే బెంగాల్‌లోని సీబీఐ, ఈడీ అధికారులపై చర్యలు తీసుకుంటాం: మమత బెనర్జీ
అయితే అప్పటి నుంచి భర్త వద్దనే ఉంటున్న అముద ఏడు రోజుల కిందట మళ్లీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రియుడి దగ్గరికి చేరుకుంది. దీంతో ఆమె కోసం భర్త, తల్లిదండ్రులు గాలించారు. కానీ ఆమె కనిపించలేదు.
ఈ క్రమంలో ఓ మహిళ అదే సిటీలోని పెద్దకుప్పం ప్రాంతంలో ఓ మృతదేహం కనిపించంది. అయితే అది కుళ్లిన స్థితిలో ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీనీ హాస్పిటల్ కు తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో ఆ మృతదేహం అముదదే అని నిర్ధారించారు. ఈ ఘటనపై ఆమె భర్త బాబు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.