చోరీ కోసం ఇంట్లోకి దూరి.. ఆకలి కావడంతో కిచిడీ వంట.. అడ్డంగా బుక్ చేసిన ఆకలి

Published : Jan 13, 2022, 03:15 AM ISTUpdated : Jan 14, 2022, 05:01 AM IST
చోరీ కోసం ఇంట్లోకి దూరి.. ఆకలి కావడంతో కిచిడీ వంట.. అడ్డంగా బుక్ చేసిన ఆకలి

సారాంశం

అసోంలో ఓ దొంగ ఇంట్లో దూరి సామాన్లు పోగేసుకున్నాడు. అన్నీ మూటగట్టుకుని బయట అడుగు పెట్టే సమయంలో ఆకలి కావడంతో కిచెన్ గదిలోకి వెళ్లాడు. తనకు అడ్డే లేదన్నట్టుగా భావించి కిచెన్‌లో కిచిడీ వండుకున్నాడు. ఈ శబ్దాలు బయటకి రావడంతో పొరుగు ఇంటి వ్యక్తి లేచి అనుమానంతో పరిశీలించాడు. ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో మెల్లగా లోపలికి వెళ్లి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.  

గువహతి: ఇంట్లో ఎవరు లేనిది చూసి సాధారణంగా దొంగలు చోరీ(Robbery)కి పాల్పడతారు. ఎవరి కంట పడకుండా ఇంట్లోకి దూరడమే కాదు. అదే విధంగా బయటపడతారు. కానీ, అసోం(Assam)లోని ఓ దొంగ ఇంట్లో ఎవరు లేనిది చూసి చోరీక పాల్పడ్డాడు. కానీ, ఆకలి కావడంతో తాను దొంగదారిన ఇంట్లో చేరిన వైనాన్నే మర్చిపోయాడు. ఇంట్లో కిచెన్‌(Kitchen)లోకి వెళ్లి కిచిడీ(KIchidi) వంట చేసుకున్నాడు. వంట చేస్తుండటంతో చప్పుళ్లు వచ్చాయి. పొరుగు ఇంటి వారు మేలుకుని ఇంట్లోకి వెళ్లి చూస్తే.. దొంగ కథ ముగిసింది. అసోంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసోం గువహతిలోని హంగెరాబారి ప్రాంతంలో ఇంటిలో యజమానులు లేరు. ఖాళీగా ఉండటాన్ని ఆ దొంగ కనిపెట్టాడు. దొంగతనానికి ప్లాన్ చేసుకున్నాడు. ఎవరు లేనిది చూసి రాత్రి పూట ఆ ఇంటిలోకి దూరాడు. ఎత్తుకెళ్లాల్సిన కొన్ని వస్తువులను పోగేసుకున్నాడు. కానీ, చోరీ చేస్తుండగానే ఆయనకు తీవ్ర ఆకలి అయింది. దీంతో గుట్టుగా ఇల్లు వదలాలనే విషయాన్ని లైట్ తీసుకున్నాడు. తనను పట్టుకునే వారు ఎవరులే? అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లాడు. కిచిడీ వంట ప్రారంభించాడు.

కిచిడీ వంట కారణంగా కిచెన్‌లో నుంచి శబ్దాలు బిగ్గరగా బయటకు వచ్చాయి. అయినా, ఆ చోరుడు వాటిని లక్ష్యపెట్టలేదు. విందు ఆరగించాల్సిందే అని తీర్మానించుకున్నాడు. దీంతో ఆ చప్పుళ్లతో పొరుగు ఇంటిలో ఒకరు మేలుకున్నారు. అనుమానంతోనే ఇంటి బయటకు వచ్చి ఆ ఇంటి తలుపులు చూశాడు. ఇంటి తాళం పగులకొట్టి కనిపించింది. దీంతో ఇంట్లో దొంగ దూరాడేమోననే అనుమానం వచ్చింది. మెల్లగా ఆ ఇంట్లోకి వెళ్లి దొంగను పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. ఆ దొంగను వారికి అప్పగించాడు.

ఈ ఘటనపై అసోం పోలీసులు సరదా ట్వీట్ పోస్టు చేశారు. దీన్ని ఆసక్తికర కేసుగా పేర్కొన్నారు. కిచిడీ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ చోరీకి వెళ్లినప్పుడు దీన్ని వండటం శ్రేయస్సుకు హానీ కలిగించవచ్చు అని ట్వీట్ చేశారు. అరెస్టు చేసిన పోలీసులు ఆ చోరుడికి వేడి వేడి ఆహారం వడ్డించిందేమో అని ఒకరు ట్వీట్ చేశారు.

రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో గత నెల సినీ ఫక్కీలో దోపిడీ(Theft) జరిగింది. పక్కా పథకం ప్రకారం.. 40 ఏళ్ల బ్రహ్మచారిని పెళ్లి(Marriage) చేసుకుని ఇంట్లోకి దిగింది. మెట్టిన ఇల్లు చేరిన కొద్ది సేపటికే ప్లాన్ అమలు చేసింది. బీరువాలోని డబ్బును తన సంచిలోకి మార్చుకుంది. ఏమీ ఎరగనట్టు తన తోడు వచ్చిన యువతి సోదరుడిని కలవాల్సి ఉన్నదని అద్దె కారులో నగదుతో ఉడాయించారు. కారులో వెళ్తుండగానే దుస్తులు మార్చుకున్నారు. ఈ వ్యవహారంతో కారు డ్రైవర్ బిత్తరపోయాడు. ఇదేంటని అడిగితే.. డ్రైవర్‌నూ వారు బెదిరించి.. పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి స్థానికులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో జరిగింది. యాచారం మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరిస్తూ పోయాడు. కొన్నేళ్లకు ఆయనకు పెళ్లి సంబంధాలు రావడమే ఆగిపోయాయి. దీంతో ఆయనే తిరిగి సంబంధాల వేటలో పడ్డాడు. అప్పటికే ఆయన 40వ పడిలో చేరాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

10 శాతం భూమిలో 21 శాతం ధాన్యం ఉత్పత్తి... ఇది కదా వ్యవసాయమంటే..!
Ambani House : నెలనెలా యాంటీలియా కరెంట్ బిల్లు ఖర్చే అంతా..! ఓ BMW కారు కొనొచ్చుగా..!!