కరోనా రహిత గ్రామ పోటీ.. గెలిచిన గ్రామానికి రూ. 50 లక్షల బహుమానం

By Mahesh KFirst Published Jan 13, 2022, 1:48 AM IST
Highlights

పూణె జిల్లా అధికారులు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి వినూత్నంగా ఆలోచించారు. గ్రామాల మధ్యనే పోటీ పెట్టారు. కరోనా రహిత గ్రామంగా నిరూపించుకున్న గ్రామలకు ప్రైజులు ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ నుంచి మార్చి 15 వరకు ఈ పోటీ జరుగుతుంది. ఆ తర్వాత ఈ కాలంలో ఆయా గ్రామాలు తీసుకున్న నిర్ణయాలు, కరోనా కట్టడిలో పురోగతి వంటి 22 అంశాలను పరిగణించి విజేత గ్రామాన్ని ప్రకటించనున్నారు.
 

పూణె: దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona Cases) భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర(Maharashtra)లో అత్యధికంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు తీసుకున్నా ఒక్కోసారి ఉల్లంఘించేవారిని ఆపడం కష్టతరంగా మారుతున్నది. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూణె(Pune) జిల్లా అధికారులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. కరోనా రహిత గ్రామంగా(Coronavirus Fress Village0 ఏర్పడటానికి పోటీ(Contest0 ప్రకటించింది. ఈ పోటీలో గెలిచిన గ్రామానికి రూ. 50 వేల బహుమానం అభివృద్ధి నిధుల రూపంలో గ్రామ పంచాయతీకి అందించనుంది. సెకండ్, థర్డ్ ప్రైజులనూ ప్రకటించింది.

పూణె జిల్లాలోని గ్రామాల్లో జనవరి 10 నుంచి ఈ పోటీ మొదలైంది. మార్చి 15 వరకు కొనసాగుతుంది. బెస్ట్ పర్ఫామెన్స్ ఉన్న మూడు గ్రామాలను ఫస్ట్, సెకండ్, థర్డ్‌గా అధికారులు నిర్ణయించనున్నారు. కరోనా కట్టడిలో ఆయా గ్రామాలు కనబరిచిన శ్రద్ధ, తీసుకున్న చర్యలు వంటి మొత్తం 22 అంశాల ఆధారంగా ఈ పోటీలో గెలిచిన గ్రామాలను నిర్ణయించనున్నారు. ఫస్ట్ ప్రైజ్ రూ. 50 లక్షలు, సెకండ్ ప్రైజ్ రూ. 25 లక్షలు, థర్డ్ ప్రైజ్ రూ. 15 లక్షలుగా ప్రకటించారు. 

గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా నిబంధనల పాలనకు, కట్టడి చర్యల్లో పాలుపంచుకోవాలనే లక్ష్యంతోనే ఈ పోటీ ప్రకటించామని పూణె జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు. గ్రామాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి ఒక్కసారిగా ఔట్‌బ్రేక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ పోటీ ఉపకరిస్తుందని వివరించారు. ఈ పోటీతో జిల్లాలోని అన్ని గ్రామాలై తమ ఫోకస్ ఉంటుందని తెలిపారు. 

శంలో కరోనా కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,720 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కిందటి రోజు కరోనాతో 277 మంది మృతిచెందగా.. గత 24 గంటల్లో కరోనాతో 442 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశం ఇప్పటివరకు మహమ్మారితో మృతిచెందిన వారి సంఖ్య 4,84,655కి పెరిగింది. నిన్న దేశంలో కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,46,30,536కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,55,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 1,805 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,281 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 645 ఒమిక్రాన్ కేసులతో రాజస్తాన్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. 

ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 1,281, రాజస్తాన్‌లో 645, ఢిల్లీలో 546, కర్ణాటకలో 479, కేరళలో 350, పశ్చిమ బెంగాల్‌లో 294, ఉత్తరప్రదేశ్‌లో 275, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 162, తెలంగాణలో 123, ఒడిశాలో 102, ఆంధ్రప్రదేశ్‌లో 54, బిహార్‌లో 27, పంజాబ్‌లో 27, గోవాలో 21, జమ్మూ కశ్మీర్‌లో 13, మధ్యప్రదేశ్‌లో 10, అసోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, చత్తీస్‌గఢ్‌లో 5, మేఘాలయలో 5, అండమాన్ నికోబార్ దీవుల్లో 3, చంఢీఘర్‌లో 3, పుదుచ్చేరిలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసు నమోదయ్యాయి. 

click me!