దారుణం.. ఎక్కాలు చదవలేదని ఐదో తరగతి విద్యార్ధి చేతికి డ్రిల్ తో గాయం చేసిన టీచర్..

By team teluguFirst Published Nov 26, 2022, 3:15 PM IST
Highlights

ఎక్కాలు చదవలేదని ఓ విద్యార్థి చేతికి టీచర్ పవర్ డ్రిల్ తో గాయం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. బాధితుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఎక్కాలు చదవలేదని ఐదో తరగతి విద్యార్థిపై ఓ టీచర్ క్రూరంగా ప్రవర్తించాడు. పవర్ డ్రిల్ తో ఆ బాలుడి అరచేతికి గాయం చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ బాలుడిని మరో విద్యార్థి రక్షించాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిసోడియాకు సీబీఐ,మోడీ క్లీన్ చిట్.. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వివాన్ అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఆ బాలుడు గురువారం కూడా పాఠశాలకు వెళ్లాడు. అయితే ఆ పాఠశాలలో లైబ్రరీ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ అనూజ్ పాండే ఉన్నాడు. 

ఆ సమయంలో ఆ లైబ్రరీ ముందు నుంచి వివాన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న బాలుడిని ఆ టీచర్ ఆపాడు. ఎక్కాలు చదవాలని చెప్పాడు. ఆ విద్యార్థికి రెండో ఎక్కం సరిగా గుర్తు రాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ టీచర్ బాలుడిపై దారుణానికి ఒడిగట్టాడు. లైబ్రరీ మరమ్మతుల కోసం తీసుకొచ్చిన డ్రిల్ ను ఉపయోగించి ఆ విద్యార్థి అరచేతికి తీవ్ర గాయం చేశాడు. ఆ బాలుడు బాధను తట్టుకోలేక తీవ్రంగా రోధించాడు. 

అదర్ పూనావాలా అని నమ్మించి ‘సీరం’ నుంచి కోటి రూపాయాల మోసం.. ఎలాగంటే?

దీనిని గమనించిన మరో విద్యార్థి వెంటనే ఎలక్ట్రికల్ ప్లగ్ లో నుంచి ఆ డ్రిల్ ప్లగ్ ను తీసివేశాడు. దీంతో అది పని చేయడం ఆగిపోయింది. కానీ అప్పటికే బాలుడి చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. వెంటనే బాధితుడిని హాస్పిటల్ లో చేర్పించారు. ఈ ఘటనపై బాధితుడు వివాన్ మాట్లాడుతూ.. తన టీచర్ రెండో ఎక్కం చదవాలని అడిగాడని, అయితే అది తనకు గుర్తురాలేదని తెలిపాడు. ‘‘ దీనిపై కోపంతో టీచర్‌ నా ఎడమ చేతికి డ్రిల్‌ వేశాడు. నా స్నేహితుడు కృష్ణ సకాలంలో స్పందించి ఎలక్ట్రిక్‌ బోర్డు నుంచి ప్లగ్‌ని తీసి మెషీన్‌ను ఆపేశాడు. అయితే ఆ సమయానికి నా అరచేయి తెగిపోయింది’’ అని విద్యార్థి చెప్పినట్టు ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.

జ్యోతిష్కుడి మాట విన్నాడు.. పాము కాటుతో నాలుక పోగొట్టుకున్నాడు

కాగా..  ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది. బడికి వెళ్లే తొందరలో బుక్ మర్చిపోయిన జయంత్ అనే విద్యార్థిపై టీచర్ కిరాతకంగా వ్యవహరించింది. కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒక బుక్ మర్చిపోయాడనే కారణంతో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థిపై అందుబాటులో ఉన్న డస్టర్ విసిరేసింది. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయం కాగా హాస్పిటల్‌కు తరలించారు. ఘటన తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా వారిపై కూడా యాజమాన్యం దాడి చేయడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

click me!