
సాధారణంగా విద్యార్థులు పరీక్షలు రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి.. ? ఆ విషయం విద్యార్థి ప్రతిభ, పరీక్ష రాసిన విధానాన్ని బట్టి మార్కులు అధారపడి ఉంటాయి. కొందరు విద్యార్థులు ఫెయిల్ అయితే మరి కొందరు అరకొర మార్కులతో పాస్ అవుతారు. మరి కొందరు విద్యార్థులకు అయితే ఫుల్ మార్క్స్ కూడా వస్తాయి. కానీ ఆ పరీక్ష నిర్వహించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు అయితే పొందలేరు కదా.. కానీ ఓ స్టూడెంట్ కు ఇదే అనుభవం ఎదురైంది.
బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం (LNMU) అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఒక పేపర్‌లో 100కి 151 సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇటీవల వర్సిటీలో జరిగిన పార్ట్-2 పరీక్షలో బీఏ(ఆనర్స్) విద్యార్థి తన పొలిటికల్ సైన్స్ పేపర్-4లో ఈ మార్కులు సాధించినట్లు ఆదివారం వెల్లడించారు. ‘‘ ఫలితాలు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఇది టెంపరరీ మార్కు షీట్. అయినప్పటికీ ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దాన్ని చెక్ చేసి ఉండాలి కదా..’’ అని అన్నారు. ఇది టైపింగ్ లోపం అని యూనివర్సిటీ అంగీకరించింది. అధికారులు సవరించిన మార్కు షీట్ ను జారీ చేస్తారు అని ఆ విద్యార్థి తెలిపారు.
Delhi Police Commissioner: ఢిల్లీకి నయా పోలీస్ బాస్.. సంజయ్ అరోరా గురించి ఆసక్తికర విశేషాలు..
అయితే ఇదే వర్సిటీలో మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. బీకామ్ పార్ట్-2 పరీక్షలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ పేపర్-4లో సున్నా సాధించిన మరో విద్యార్థి తన నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ అయ్యాడు. ఈ విషయాలపై వర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ వార్తా సంస్థ ‘పీఐటీ’ మాట్లాడారు. రెండు మార్క్‌షీట్‌లలో టైపింగ్ తప్పులు జరిగాయని అన్నారు. టైపోగ్రాఫికల్ లోపాలను సరిదిద్దిన తరువాత, ఇద్దరు విద్యార్థులకు తాజాగా మార్కుల షీట్లు జారీ చేస్తామని అన్నారు. ఇవి కేవలం టైపోగ్రాఫికల్ తప్పులనీ, ఇందులో మరేమీ లేదని చెప్పారు.