
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో రికవరీ చేసిన డబ్బు తనది కాదని, తనపై కుట్రపన్నుతున్నారని పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అన్నారు. తనపై ఎవరు కుట్ర పన్నుతున్నారో కాలమే సమాధానం చెబుతుందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం జోకాలోని ఈఎస్ఐ హాస్పిటల్ కు పోలీసులు ఆదివారం ఆయనను తీసుకెళ్లారు. వాహనం దిగి హాస్పిటల్ కు వెళ్లిన సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
Delhi Police Commissioner: ఢిల్లీకి నయా పోలీస్ బాస్.. సంజయ్ అరోరా గురించి ఆసక్తికర విశేషాలు..
‘‘ ఆ డబ్బు (రికవరీ) నాది కాదు. ’’ అని ఛటర్జీ అన్నారు. మీ పై ఎవరు కుట్రపన్నుతున్నారని ప్రశ్నించగా.. ‘‘ సమయం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ’’ అని ఆయన అన్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించే చర్యపై అభిప్రాయాన్ని అడిగినప్పుడు ‘‘ ఆమె (బెనర్జీ) నిర్ణయం సరైనదే ’’ అని అన్నారు. ‘‘ఈ నిర్ణయం (నన్ను సస్పెండ్ చేయడం) నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేయగలదు ’’ అని ఆయన చెప్పారు. కాగా ఇదే విషయంపై ఆయన శుక్రవారం భిన్న సమాధానం ఇచ్చారు. తాను కుట్రకు బలి అయ్యానని అన్నారు. సస్పెండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. గత గురువారం ఆయనను పార్టీ నుంచి కూడా స్పస్పెండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ సిఫారసుల మేరకు నిర్వహించిన టీచర్ రిక్రూట్ మెంట్ తో పాటు, గ్రూప్-సీ, డీ సిబ్బంది నియామకాల్లో జరిగిన అవకతవకలపై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో మనీ జాడపై ఈడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఆయనను ఇటీవలే అరెస్టు చేసింది. అలాగే ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఛటర్జీకి అత్యంత సన్నితుల్లో ఒకరైన అర్పితా ముఖర్జీకి చెందిన ఇళ్లల్లో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బలహీన వర్గాలు తరచూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నాయి - సీజేఐ ఎన్వీ రమణ
ఈ సమయంలో ఆమె ఇంట్లో కోట్లాది రూపాయిల డబ్బులు కనిపించాయి. నగలు కూడా లభించాయి. వీటిని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న డబ్బుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తరువాత ఆమెను అరెస్టు చేశారు.ఈ కేసులో మొదటి నుంచి అర్పితా ముఖర్జీ పేరు వినిపిస్తోంది. అయితే ఆమె గురించి జనాలకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె మంత్రి పార్థ ముఖర్జీకి సన్నిహితురాలు. నటి, మోడల్ గా ఉన్న అర్పిత ఒడిశా చిత్ర పరిశ్రమలో నటించింది. ఆమె అనేక తమిళ చిత్రాలకు కూడా పనిచేసింది. మామా-భంగే, పార్టనర్ తో కలిసి బెంగాలీ చిత్రాలలో కూడా ఆమె నటించారు.
మూలాల ప్రకారం.. ఆమె చాలా సంవత్సరాలుగా నక్తలా పూజను ప్రమోట్ చేస్తోంది. అలాగే అర్పితా బెహలా వెస్ట్ సెంటర్‌లో పార్థ ఛటర్జీతో కలిసి కొన్ని సార్లు ప్రచారం చేయడం కూడా కనిపించింది. గత కొన్నేళ్లుగా దక్షిణ కోల్‌కతాలోని ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఈ కేసుకు సబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆమె పాస్ పోర్టులో విదేశీ పర్యటను చేసి వచ్చిన వివరాలు ఉండటంతో ఈ విషయంలో ఈడీ ప్రశ్నలు కురిపిస్తోంది. అసలు వెకేషన్ కోసం అని అన్ని దేశాలకు వెళ్లారా ? లేదా ఏదైనా ఆర్థిక లావాదేవీల కోసం అక్కడికి వెళ్లారా అనే విషయాలను ఈడీ ఆరా తీస్తోంది.