ఎన్సీపీకి ఎదురుదెబ్బ.. శివ‌సేన షిండే వ‌ర్గంలో చేరనున్న అశోక్ గావ్డే

By team teluguFirst Published Sep 11, 2022, 12:14 PM IST
Highlights

ఎన్సీపీ సీనియర్ నాయకుడు, శరద్ పవార్ కు సన్నిహితుడిగా పేరున్న నాయకుడు అశోక్ గావ్డే శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరనున్నారు. నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ పరిణామం పార్టీకి ఇబ్బందికరమైన అంశమే. 

నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఎన్సీపీకి భారీ షాక్ త‌గ‌లింది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అశోక్ గావ్డే మరో ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరేందుకు సిద్ధం అయ్యారు. నవీ ముంబై జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గావ్డేను ఇటీవలే ఎన్సీపీ తొల‌గించింది. ఆ స్థానంలో నామ్ దేవ్ భగత్ ను ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ నియమించారు.

బీజేపీ పాలనలో దేశం వేదనతో నిండిపోయింది.. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలి - ఎన్సీపీ

అశోక్ గావ్డే ఈ పదవి నుండి తొలగించే సమయంలో సీఎం ఏక్ నాథ్ షిండేతో సంప్రదింపులు జరిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. అయితే ప్రస్తుతం పార్టీ నుంచి వైదొలగనున్న గావ్డే  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అయితే తన కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవడానికి గావ్డే బుధవారం తన మద్దతుదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కారణంగా దానిని గురువారం నిర్వ‌హించారు. 

ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించి అసహజ శృంగారం... ఎంపీలో దారుణం

ఈ సంద‌ర్భంగా అశోక్ గావ్డే త‌న మ‌ద్ద‌తు దారుల‌కు సోషల్ మీడియా ద్వారా సందేశం అందించారు. ‘‘పార్టీ స్థానిక యూనిట్‌లో గ్రూపిజం ఉంది. కొంత మంది సీనియర్ పార్టీ కార్యకర్తలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాకు అన్యాయం చేస్తున్నారు. విశ్వాసం ఉన్న పార్టీ కార్యకర్తలతో నేను సమావేశాన్ని నిర్వహిస్తాను. నాలో నేను భవిష్యత్ కార్యాచరణ చర్చించి, తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. తదుపరి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో వారు నాకు మార్గనిర్దేశం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.’’ అని అన్నారు. 

కేంద్రాన్ని విమర్శించకుంటే.. నేనే ఉపరాష్ట్రపతిని అయ్యేవాడిని.. : మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్

అయితే 2019 సంవత్సరంలో ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే గణేష్ నాయక్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు నవీ ముంబై యూనిట్‌లోని పార్టీ సభ్యులను తనతో పాటు కాషాయ పార్టీలోకి తీసుకెళ్లారు. కానీ ఆ స‌మ‌యంలో అశోక్ గావ్డే గణేష్ నాయ‌క్ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. బీజేపీలో చేరేందుకు నిరాక‌రించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి వార్త‌ల్లో నిలిచారు. ఈ విషయంలో ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదైంది.

click me!