జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

By Sumanth KanukulaFirst Published Sep 11, 2022, 11:20 AM IST
Highlights

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే ఈరోజు ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలను విడుదల చేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే ఈరోజు ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://result.jeeadv.ac.in/‌ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. వారి స్కోర్ కార్డును, ర్యాంక్‌లను చూసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు మెరిట్‌ లిస్ట్‌‌ను కూడా విడుదల చేశారు. ఇక, ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

ఈ సంవత్సరం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పేపర్ 1, పేపర్ 2 రెండింటిలోనూ మొత్తం 1,55,538 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 40712 మంది అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆర్కే శిశిర్ టాపర్‌గా నిలిచారు. శిశిర్ 360 మార్కులకు గానూ 314 మార్కులు సాధించారు. శిశిర్ ఐఐటీ బాంబే జోన్‌కు చెందినవారు. ఇక, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 12న జరిగే జాయింట్ సీట్ల కేటాయింపు (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
-అధికారిక వెబ్‌సైట్‌ https://result.jeeadv.ac.in/‌ను సందర్శించాలి. 
-అక్కడ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
-లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి- రిజిస్ట్రేషన్ నంబర, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి. 
- అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

దేశంలోని ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పరీక్షను నిర్వహించారు. గత నెల 28న జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేశారు. 

click me!