డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది దేశం కాదని, భారత్ ఒక ఉపఖండం అని వివరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదని అన్నారు.
డీఎంకే లోక్ సభ ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది ఒక దేశం కాదని పేర్కొంటూ కొత్త వివాదాన్ని రేపారు. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అనే నినాదాలను ఆయన తప్పుపట్టారు. ఏ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. హిందూయిజం అనేది దేశానికి, అలాగే ప్రపంచానికి కూడా ఒక సమస్యే అని పేర్కొన్నారు. తాజాగా, మరోసారి ఆయన వివాదాన్ని రేపారు.
ఇండియా అనేది ఒక దేశం కాదని ఏ రాజా అన్నారు. అయితే, ఇది ఒక ఉపఖండం అని వివరించారు. తమిళం ఒక దేశం, మలయాళం ఒక దేశం, ఒడియా ఒక దేశం.. ఇలా అనేక దేశాలతో ఏర్పడిందే భారత ఉపఖండం అని తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి ఈ ఉనికే గల్లంతు అవుతుందని పేర్కొన్నారు.
The hate speeches from DMK’s stable continue unabated. After Udhayanidhi Stalin’s call to annihilate Sanatan Dharma, it is now A Raja who calls for balkanisation of India, derides Bhagwan Ram, makes disparaging comments on Manipuris and questions the idea of India, as a nation.… pic.twitter.com/jgC1iOA5Ue
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya)బీజేపీ ఐటీ శాఖ హెడ్ అమిత్ మాలవీయా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. డీఎంకే నుంచి వరుసగా విద్వేష ప్రసంగాలే వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపు ఇచ్చారని, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ ఏ రాజా మరో వివాదాన్ని రేపారని తెలిపారు. డీఎంకే నుంచి ఒక క్రమబద్ధంగానే విద్వేష పూరిత వ్యాఖ్యలు వస్తున్నాయని, వీటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.