అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశేషమేమిటంటే ప్రారంభోత్సవ కార్యక్రమంలో 24 మంది అర్చకులకు పూజలు తదితరాల కోసం శిక్షణ ఇస్తున్నారు. ఈ పూజారుల్లో బ్రాహ్మణులతో పాటు ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన పూజారులు కూడా ఉన్నారు.
అయోధ్య :రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన విశేషాలు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టా మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ చారిత్రక ఆలయ సంప్రోక్షణ కార్యక్రమానికి 24 మంది అర్చకులను ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు అర్చకులు ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు. ఇది అయోధ్యలోని సామాజిక సామరస్యాన్ని తెలియజేస్తుంది.
ఓబీసీ, ఎస్సీ వర్గానికి చెందిన పూజారులు..
జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు, వీవీఐపీలను ఆహ్వానించారు. రామ్ లాలా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 24 మంది పూజారులు పూజ బాధ్యతలు తీసుకుంటారు. విశేషమేమిటంటే ఈ పూజారులు అందరూ బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు కాదు. అందులో ముగ్గురు పూజారులు బ్రాహ్మణులు కాకపోవడం ఆశ్చర్యకరం. వీరిలో ఒకరు ఓబీసీ కేటగిరీకి చెందినవారు కాగా, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) నుంచి ఉన్నారు.
గులాబీ పూరేకులపై అయోధ్యరామయ్య.. రామాలయంలో ఆకట్టుకోనున్న పూలచిత్రాలు...
కులం కాదు విద్యార్హతనే ప్రామాణికం
రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ పూజారులను మతం, కులాల ప్రాతిపదికన కాకుండా అర్హత ఆధారంగా ఎంపిక చేశారు. రాముడు శబరి పెట్టిన ఎంగిలిపండ్లు తిన్నాడనేది లోకవిధితం..ఈ ఘటననే పూజారుల ఎంపెకకు ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అందుకే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా అర్చకులకు కులాన్ని కాకుండా వారి అర్హతను బట్టి స్థానం కల్పించారు. ఇంతకు ముందు కూడా రామమందిరం ప్రధాన పూజారి ఇతర వెనుకబడిన తరగతుల నుంచి వచ్చినవారే. దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలలో కూడా, పూజారులు బ్రాహ్మణేతర సమాజానికి చెందినవారు.
అర్చకులకు శిక్షణ ఇస్తున్నారు
ఆలయంలో పూజల కోసం, రామాలయానికి చెందిన మహంత్ మిథిలేష్ నందిని శరణ్, మహంత్ సత్యనారాయణ దాస్ లు అర్చకత్వం, ఆచార వ్యవహారాలలో శిక్షణ ఇస్తున్నారు. 300 మంది అర్చకులను ఇంటర్వ్యూ చేయగా 24 మందిని ఎంపిక చేశారు. రామమంగి సంప్రదాయం ప్రకారం అర్చకులందరికీ 3 నెలల పాటు శిక్షణ కొనసాగుతుంది.