గర్భం దాల్చేందుకు పూజలు చేస్తానని వివాహితపై సాధువు అత్యాచారం.. గుజరాత్ లో ఘటన

By team telugu  |  First Published Jan 29, 2023, 9:07 AM IST

గుజరాత్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ సాధువు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చేందుకు ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 


ఆమెకు పెళ్లయి పదేళ్లు అవుతోంది. కానీ తల్లి కావాలన్న తన కోరిక నెరవేరలేదు. అయితే ఆమె గర్భం దాల్చేందుకు ఓ సాధువును ఆశ్రయించింది. ఆమెను అవసరాన్ని అతడు అవకాశంగా తీసుకున్నాడు. తాను తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని, దాని కోసం పూజలు చేస్తానని ఆమెను చెప్పాడు. ఈ మాటలు నమ్మి వెళ్లిన మహిళపై ఆ సాధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

ఫీల్డ్ పర్యటనలో సీఎం.. ఫిబ్రవరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త కార్యక్రమం

Latest Videos

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం గోద్రా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఇంత వరకు పిల్లలు జన్మించలేదు. దీంతో పిల్లల కోసం ఆమె టింబి ఆశ్రమంలోని రామ్ టేక్రి ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉంటుంది, ఈ క్రమంలో ఆమెకు అక్కడ కృష్ణకుమార్ అనే సాధువుతో పరిచయం ఏర్పడింది. 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెత్త.. ట్రైన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

ఈ క్రమంలో ఆమె సమస్యను అతడు తెలుసుకున్నాడు. ఆ సమస్యకు తాను పరిష్కారం చూపిస్తానని, గర్బం దాల్చేందుకు సాయం చేస్తానని ఆమెను నమ్మించాడు. అందులో భాగంగా కొన్ని మతపరమైన ఆచారాల పేరుతో కృష్ణకుమార్ ఆమెకు రెండు, మూడు సార్లు ఫోన్ చేశాడు. దీంతో ఆమెకు గర్భం దాల్చుతానని నమ్మకం ఏర్పడింది. 

ఆర్టీసీ బస్సులోనే పురిటి నొప్పులు, మహిళ ప్రసవం.. నెలలు నిండని శిశువు మరణం

గత శుక్రవారం కూడా నిందితుడు ఏదో మతపరమైన ఆచారాల సాకుతో మహిళకు మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో ఆమె అతడి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన ఘోరాన్ని ఆ మహిళ పోలీసులకు వివరించింది. నిందితుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పంచమహల్ రూరల్ పోలీసులు రామకృష్ణ కుమార్ ను అరెస్టు చేశారు. 

click me!