డాక్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ గర్భిణికి ప్రసవం చేసిన నర్సు.. వికటించి బాలింత మృతి

By Asianet NewsFirst Published Jun 8, 2023, 9:06 AM IST
Highlights

డాక్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ నర్సు గర్భిణికి ప్రసవం చేసింది. ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కానీ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ కడుపులో నరం కట్ చేయడంతో ఆ బాలింత మరణించింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. 


బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 3 ఇడియట్స్ సినిమాలో చూపించిన విధంగా.. నిజ జీవితంలో వీడియో కాల్ చేస్తూ చేసిన ప్రసవం ఓ గర్భిణి ప్రాణాలు పోయేలా చేసింది. బీహర్ లోని పూర్ణియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. గైనకాలజిస్ట్ వీడియో కాల్ లో చెప్పిన విధంగా ఓ గర్భిణికి నర్సు ప్రసవం చేసింది. అయితే అది వికటించడంతో ఆమె మరణించింది.

రైతుల కోసం ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఖరీఫ్ పంటల ఎంఎస్పీ పెంపు - ప్రధాని మోడీ

వివరాలు ఇలా ఉన్నాయి. 22 ఏళ్ల మాల్తీ దేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సోమవారం సాయంత్రం పూర్ణియా లైన్ బజార్ ప్రాంతంలోని సమర్పణ్ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ సీమా కుమారి హాస్పిటల్ లో లేరు. ఆ డాక్టర్ నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆ మహిళను హాస్పిటల్ మేనేజ్ మెంట్ అడ్మిట్ చేసుకుంది.

అయితే మాలతికి తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. ఓ నర్సును ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఆమె డాక్టర్  సీమా కుమారికి వీడియో కాల్ చేశారు. ఆమె సూచనల ఆధారంగా ఆపరేషన్ ను పూర్తి చేశారు. మాలతికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కానీ ఆ నర్సు ఆమెకు తెలియకుండానే పేషెంట్ కడుపులోని ముఖ్యమైన నరాన్ని కత్తిరించింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది.

హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి.. గంగా జమునా స్కూల్ యాజామన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు..

ఆ మహిళ జన్మనిచ్చిన ఇద్దరు శిశువులు సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఖాజాంచి సహాయక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రంజిత్ కుమార్ తన బృందంతో కలిసి ఆసుపత్రికి చేరుకుని శాంతిభద్రతలను పునరుద్ధరించారు.

బాధితురాలి కుటుంబం నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాన్ని పూర్ణియాలోని సివిల్ సర్జన్ కార్యాలయానికి పంపించామని తెలిపారు. ఈ విషయాన్ని పూర్ణియా సివిల్ సర్జన్ దర్యాప్తు చేస్తారని, ఈ విషయంలో వైద్య నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే డాక్టర్, ఆసుపత్రి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎస్ హెచ్ వో తెలిపారు. 

విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి

ఈ ఘటనపై సమాచారం అందడంతో జన అధికార్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ పార్లమెంట్ సభ్యుడు పప్పుయాదవ్ హాస్పిటల్ కు చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్ సర్జన్, ఖాజాంచి సహాయక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోను కోరారు. 
 

click me!