మతం దాచి పెట్టి హిందూ యువతితో పెళ్లికి సిద్ధమైన ముస్లిం యువకుడు.. అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Dec 13, 2022, 3:53 PM IST
Highlights

ఓ ముస్లిం యువకుడు తన మతం దాచి పెట్టి హిందూ యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పెళ్లికి ఒక రోజు ముందు ఆ యువతికి నిజం తెలిసింది. దీంతో ఆమె వివాహాన్ని రద్దు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన మతం దాచి పెట్టి హిందూ యువతితో పెళ్లికి సిద్ధమైన ఓ ముస్లిం యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వీరి వివాహం సోమవారం జరగాల్సి ఉండగా.. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సినీ ఫక్కీలో చోరీ.. సీబీఐ అధికారులమంటూ వ్యాపారికి టోకరా

ఎన్డీటీవీ కథనం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ కు చెందిన ఓ మహిళ ఉద్యోగం చేయడానికి యూపీకి వచ్చింది. అయితే ఆమె గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీలో నివసిస్తున్నప్పుడు హసీన్ సైఫీ అనే ముస్లిం యువకుడు పరిచయం అయ్యాడు. కానీ అతడు తనను తాను ఆశిష్ ఠాకూర్ అని పరిచయం చేసుకున్నాడు. అయితే కొంత కాలం తరువాత ఆ మహిళ ఉద్యోగాన్ని కోల్పోయింది. ఈ సమయంలో ఆమెకు సైఫీ సాయం చేశాడు. ఆమెకు దగ్గరవ్వడానికి నిందితుడి దీనిని ఒక అవకాశంగా వాడుకున్నాడు.

అరుణాచల్‌లో ఘర్షణలు.. సరిహద్దులో పరిస్థితులపై స్పందించిన చైనా.. ఏమన్నదంటే?

సైఫీ ఆ మహిళతో కలిసి దాద్రి ప్రాంతం ఎస్కార్ట్ కాలనీలోని అద్దె ఫ్లాట్ కు మారాడు. అక్కడ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అశ్లీల వీడియోలు కూడా రికార్డ్ చేశాడు. ఆ సమయంలో తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి కూడా పెంచాడు. చివరికి పెళ్లి చేసుకునేందుకు ఆ మహిళ అంగీకరించింది. 

మోడీ పాలనలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించబడలేదు.. కాంగ్రెస్ పై కేంద్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు..

వీరిద్దరి వివాహాన్ని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. సోమవారం వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఆదివారం హసీన్ సైఫీ తండ్రి హసీన్ తన కుమారుడిని వెతుక్కుంటూ ఆపార్ట్ మెంట్ కు చేరుకున్నాడు. అయితే ఆ జంట ఆ సమయంలో ప్లాట్ లో లేరు. దీంతో తండ్రి ఆ అపార్ట్ మెంట్ లో తన కుమారుడి ఆచూకీ కోసం పలువురిని సంప్రదించాడు. అక్కడ అందరూ సైఫీ అంటే ఎవరో తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. కానీ ఆశిష్ ఠాకూరే సైఫీ అని తరువాత అందరికీ అర్థం అయ్యింది.

‘హత్యకు గురైన’ మహిళ అరెస్టు.. ఆమెను ‘చంపిన’ భర్తకు బెయిల్.. అసలేం జరిగిందంటే?

ఈ విషయం ఆ యువతికి తెలిసింది. తనతో ఇంత కాలం ఉన్నది హిందువు కాదని, ముస్లిం అని తెలియడంతో ఆమె మనస్థాపానికి గురయ్యింది. తాను ఓ ముస్లింను పెళ్లి చేసుకోబోనని అతడికి తేల్చి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోమవారం నిందితుడుని అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా మోసం, అత్యాచారం, బలవంతపు మత మార్పిడి వంటి అభియోగాలు మోపినట్లు గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు.

click me!