కళ్ల ముందే కడతేరుస్తున్నా అడ్డుకోని జనం.. బాలికను చంపిన కొన్ని సెకన్లకే ఫోన్ ఆఫ్ చేసి, బస్సులో వెళ్లిన సాహిల్

By Asianet NewsFirst Published May 30, 2023, 9:48 AM IST
Highlights

ఢిల్లీలో మైనర్ హత్య ఘటనలో పలు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను సాహిల్ హత్య చేస్తున్నప్పుడు పక్కనే జనాలు న్నా కూాడా పట్టించుకోలేదు. కనీస మానవత్వం చూపలేదు. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 

ఢిల్లీలోని రోహిణిలో ఆదివారం జరిగిన 16 ఏళ్ల బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. షాబాద్ డెయిరీలో ప్రాంతంలో దుండగుడు సాహిల్ మైనర్ బాలికను క్రూరంగా కత్తితో 21 సార్లు పొడిచాడు. సిమెంట్ స్లాబ్ తో కొట్టాడు. ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇంత జరుగుతున్నా.. పక్కన ఓ బాలిక ప్రాణాలు పోతున్నా అక్కడున్న వారెవరూ పట్టించుకోలేదు. తమకేమీ తెలియదన్నట్టుగా.. అక్కడేమీ జరగడం లేదన్నట్టుగానే ప్రవర్తిచడం విస్తు గొలుపుతోంది. కనీసం బాలికను కాపాడే ఆలోచన కూడా రాకపోవడం శోఛనీయం. అటు నుంచి ఇటు స్థానికులు నడుస్తున్నారే తప్ప.. కనీసం నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

ఘోర రోడ్డు ప్రమాదం.. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

నిందితుడు సాహిల్ ఆమెను పొడిచి చంపిన తరువాత, మళ్లీ వచ్చి ఆమెను బండతో బాదిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ దారుణ హత్య జరిగిన సమయంలో స్థానికుల ప్రవర్తన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కాగా.. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ కేసు విచారణలో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్ ను హతమార్చిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే సాహిల్ తన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తరువాత ఓ బస్సు ఎక్కి ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కు చేరుకున్నాడు. కాగా.. ఈ ఘనటపై సమాచారం అందుకున్న పోలీసులు ఢిల్లీ పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు తండ్రిని వెంటబెట్టుకొని బులంద్ షహర్ కు వెళ్లారు. అక్కడే నిందితుడైన సాహిల్ ను అరెస్టు చేశారు.

ఎలక్ట్రిక్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్.. ఎనిమిది మంది కూలీలు మృతి

ఇదిలా ఉండగా.. సాహిల్, బాధితురాలు మూడేళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారని సమాచారం. అయితే మైనర్ ఈ ప్రేమ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ యువకుడు ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్ గా పని చేసే నిందితుడికి, మైనర్ కు మధ్య ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు వాగ్వాదం జరిగింది. కాగా..ఈ ఘటనలో సాహిల్ పై పీఎస్ షాబాద్ డెయిరీలో ఐపీసీ సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నిర్మల్ లో విషాదం.. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకిన యువకుడు.. ఈతరాకపోవడంతో..

నిందితుడికి మరణశిక్ష విధించాలి - బాలిక తల్లిండ్రులు
తమ కూతురిని దారుణంగా హతమార్చిన నిందితుడి తల్లికి ఉరి శిక్ష వేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారని ‘ఇండియా టుడే’ నివేదించింది. సాహిల్ గురించి తనతో కూతురు ఎప్పుడూ ఏమీ చెప్పలేదని తల్లి పేర్కొన్నారు. ఆమెను ఎందుకు చంపాడో కూడా తెలియడం లేదని అన్నారు. ఈ విషయం అధికారులకు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. ‘నా కుమార్తెను పలుమార్లు కత్తితో పొడిచారు, ఆమె తలను కూడా ముక్కలుగా నరికారు. నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని తండ్రి పేర్కొన్నారు. 

click me!