ఇదేం సరదా.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టిన స్నేహితుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

By Asianet News  |  First Published May 11, 2023, 8:00 AM IST

కేరళలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అస్సాంకు చెందిన ఓ ఇద్దరు కార్మికులు స్నేహితులు. వారిలో ఒకరు మరొకరి ప్రైవేట్ పార్టులో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టాడు. దీంతో బాధితుడు మరణించాడు.


వెర్రి వేయి విధాలు అని పెద్దలు తరచూ చెబుతుంటారు. కొన్ని సార్లు కొందరు చేసే తెలివి తక్కువ పనులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంటుంది. ఓ ఇద్దరు వ్యక్తులు సరదాగా కోసం చేసిన ఓ వెర్రి పని ఒకరి ప్రాణాలను బలిగొంది. ఓ వ్యక్తి అర్ధాంతరంగా కన్నుమూశాడు. అంత వరకు నవ్వుతూ గడిపిన అతడు.. అందరినీ తీవ్ర విషాదంలో ముంచేశాడు. ఓ స్నేహితుడు సరదా కోసం మరో స్నేహితుడి ప్రైవేట్ భాగాల్లో గాలి కొట్టాడు. దీంతో బాధితుడు మరణించాడు. అసలు ఏం జరిగిందంటే ?  

మే 13న బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుంది - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్

Latest Videos

అస్సాంకు చెందిన 36 ఏళ్ల  సిద్ధార్థ్, మింటూ అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. వీరు కేరళలోని పెరుంబవూరుకు వలస కూలీలుగా వచ్చి జీవనం సాగిస్తున్నారు. రోజూ కూలీ పనులకు వెళ్తున్నారు. వేసవి కాలం కాబట్టి ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంది. దీంతో వారిద్దరూ ప్రతీ రోజు పని ప్రదేశంలో ఉన్న కంప్రెషర్ పంపుతో గాలిని వీచుకుంటూ ఉపశమనం పొందేవారు.

మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన ఎంకే స్టాలిన్.. ఎస్ఎం నాసర్ ను తొలగించి టీఆర్పీ రాజాకు చోటు.. ఎందుకంటే ?

ఎప్పటిలాగే సోమవారం కూడా వారిద్దరూ పనికి వెళ్లారు. వేడి ఎక్కువగా ఉండటం వల్ల మళ్లీ రోజూ మాదిరిగానే కంప్రెషర్ పంపుతో గాలిని వీచుకున్నారు. అయితే ఈ సారికి వారికి ఓ తెలివి తక్కువ ఆలోచన వచ్చింది. సరదాగా ఈ కంప్రెషర్ పంపుతో ప్రైవేట్ భాగాల్లో గాలి కొట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో సిద్ధార్థ్ అనే వ్యక్తి తన స్నేహితుడైన మింటూ పురీషనాళంలో కంప్రెషర్ పంపు పెట్టి గాలిని కొట్టాడు. దీంతో ఒక్క సారిగా మింటూ కడుపు ఉబ్బిపోయింది. అస్వస్థతకు గురై, స్పృహ తప్పి పడిపోయాడు.

కునో నేషనల్ పార్క్ లో లైంగిక హింసతో ఆడ చిరుత మృతి.. మూడు నెలల్లో మూడో మరణం

స్నేహితుడికి అలా జరగడంతో సిద్ధార్థ ఆందోళనకు గురయ్యాడు. అతడిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కానీ అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఏం జరిగిందని డాక్టర్లు సిద్ధార్థ్ ను అడిగితే.. ఏం జరిగిందో తనకు తెలియదని, ఉన్నట్టుండి తన స్నేహితుడు స్పృహ తప్పి పడిపోయాడని చెప్పాడు. దీంతో డాక్టర్లకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడిని పోలీసులు విచారించడంతో చేసిన పనిని ఒప్పుకున్నాడు. నిందితుడి అదుపులోకి తీసుకొని,  ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

click me!