ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

By Rajesh Karampoori  |  First Published May 11, 2023, 6:21 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అగ్నిప్రమాదంలో మరణించారు. దీంతో గ్రామమంతా విషాధచాయలు అలుముకున్నాయి. 


ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అగ్నిప్రమాదంలో మరణించారు. దీంతో గ్రామమంతా విషాధచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఖుషీనగర్‌ జిల్లాలోని రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాఘి మథియా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు కాలిపోయారని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు, అధికారుల సహకారంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా ఇద్దరు మృతి చెందారు.

సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ రమేష్ రంజన్, పోలీసు సూపరింటెండెంట్ ధవల్ జైస్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉంది. మృతుల కుటుంబానికి సీఎం తరపున ఒక్కొక్కరికి రూ.4 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. దీంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సూచనలు చేశారు. 

Latest Videos

జిల్లా మేజిస్ట్రేట్ కేవలం ఐదుగురే అక్కడికక్కడే మరణించినట్లు ధృవీకరించారనీ, తన కుటుంబంలో ఏడుగురు చనిపోయారని షేర్ మహ్మద్ చెప్పారు. ప్రమాదంలో తన భార్య ఫాతిమా ఖాతూన్‌తో పాటు తన నలుగురు కుమార్తెలు, తాత, అమ్మమ్మ కూడా చనిపోయారని, మృతుల సంఖ్యను దాచేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాేగే.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వాహనం సకాలంలో చేరకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులతో పాటు ఓ మహిళ కాలిన గాయాలతో మృతి చెందింది. ముగ్గురు వ్యక్తులు కూడా కాలిపోయారని చెబుతున్నారు. కానీ, ఈ ఘటనలో ఐదుగురు కాదు..ఏడుగురు చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. మృతుల సంఖ్యను జిల్లా యంత్రాంగం దాచిపెడుతోందని ఆరోపించారు.

click me!