హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ వికటించి వ్యక్తి మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Dec 4, 2022, 2:49 PM IST
Highlights

జుట్టు తెచ్చుకునేందుకు చేసుకున్న ఆపరేషన్ ఓ వ్యక్తి ప్రాణాలమ మీదికి తీసుకొచ్చింది. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ ఫెయిల్ కావడంతో 30 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని ఓ క్లినిక్ లో కొంత కాలం కిందట 30 ఏళ్ల రషీద్ అనే వ్యక్తి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ చేయించుకున్నాడు. కానీ అయితే కొంత కాలం తరువాత అవయవాల వైఫల్యంతో అతడు మరణించాడు.

పూజలో కూర్చునే హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన భక్తుడు.. మధ్యప్రదేశ్ గుడిలో ఘటన (వీడియో)

దీంతో రషీద్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. 

‘ఆమె గర్భంతో ఉన్నా కూడా అత్యాచారం చేశారు’-బిల్కిస్ బానో ఘటనను తల్చుకుంటూ ఉద్వేగానికి లోనైన ఒవైసీ

కాగా.. రషీద్‌కు తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఆ కుటుంబం అతడి మీదే ఆధారపడి జీవించేది. రషీద్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కాగా.. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ వల్లే తన కొడుకు మృతి చెందడం బాధాకరమని మృతుడి తల్లి అసియా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. రషీద్ శరీరమంతా దద్దుర్లు వచ్చాయని ఆమె తెలిపారు. దీనిని గమనించే తాము శస్త్రచికిత్స చేసిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించామని చెప్పారు.

‘కశ్మీర్ ఫైల్స్ ప్రాపగాండనే’.. నడవ్ లాపిడ్‌ను సమర్థించిన మరో ముగ్గురు జ్యూరీ సభ్యులు

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం తప్పు అని అందరికీ తెలియజేయడానికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆసియా బేగం తెలిపారు. తనలాగా మరే తల్లి కూడా తన కుమారుడిని పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. జుట్టు మార్పిడి అనేది ఒక మోసపూరిత పద్ధతి అని ఆరోపించింది. 

click me!