పూజలో కూర్చునే హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన భక్తుడు.. మధ్యప్రదేశ్ గుడిలో ఘటన (వీడియో)

Published : Dec 04, 2022, 01:43 PM ISTUpdated : Dec 04, 2022, 01:48 PM IST
పూజలో కూర్చునే హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన భక్తుడు.. మధ్యప్రదేశ్ గుడిలో ఘటన (వీడియో)

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో సాయిబాబా భక్తుడు పూజ చేస్తూనే కన్నమూశాడు. దేవుడి విగ్రహం వద్ద తల వాల్చి పదిహేను నిమిషాలపాటు మళ్లీపైకి ఎత్తకపోవడంతో అనుమానంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు.   

భోపాల్: ఓ వ్యక్తి పూజలో కూర్చుని మళ్లీ లేవలేదు. దేవుడి విగ్రహంపై వద్ద తల వంచి అలాగే ఉండిపోయాడు. హార్ట్ ఎటాక్‌తో ఆ వ్యక్తి పూజ చేస్తూనే మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఘటన ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కాట్నిలో గురువారం చోటుచేసుకుంది.

రాజేష్ మెహనీ సాయి బాబా భక్తుడు. ఆయన సమీపంలోని సాయిబాబా ఆలయానికి ప్రతి గురువారం వెళ్లి దేవుడికి పూజ చేస్తుండేవాడు. ఈ గురువారం కూడా ఆలయానికి వెళ్లాడు. దేవుడి విగ్రహానికి పరిక్రమ చేశాడు. ఆ తర్వాత దేవుడి విగ్రహం వద్ద కూర్చున్నాడు. మళ్లీ లేవలేదు. తల వాల్చి దేవుడి విగ్రహం వద్ద ఉంచాడు. సుమారు పదిహేను నిమిషాలైన అక్కడి నుంచి తల పైకి ఎత్తలేదు. ఆయన లేవలేదు. దీంతో అనుమానం వచ్చిన అక్కడి వారు పూజారికి విషయం చెప్పారు. అతడిని అక్కడికి పిలిచారు. అనంతరం, రాజేష్ మెహానీని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆయన అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు. బహుశా ఆయనకు సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చి ఉండొచ్చని అధికారులు తెలిపారు. 

Also Read: అంతా బాగానే ఉంటుంది అక్క.. ఏడుస్తూంటే ఓదార్చిన బుడ్డోడు.. వైరల్ అవుతున్న వీడియో..

రాజేష్ మెహానీ ఓ మెడికల్ స్టోర్ నిర్వహిస్తుండేవాడు. ప్రతి గురువారం ఆ సాయిబాబా ఆలయానికి వచ్చి పూజ చేసుకుని వెళ్లేవాడు.

ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. ఈ సీసీటీవీ ఫుటేజీని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు