
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు చొరబడకుండా అడ్డుకునే ప్రయత్నంలో శుక్రవారం ఓ భారత సైనికుడు మరణించాడు. ఇదే ఘటనలో ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. శ్రీనగర్ రక్షణ పీఆర్వో తెలిపిన వివరాల ప్రకారం.. పీవోకే నుంచి ఉగ్రవాదుల చొరబాటు జరుగుతోందని సైన్యానికి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జూన్ 7-8 అర్ధరాత్రి సమయంలో గరంగ్ నార్ సమీపంలో ఆకస్మిక దాడికి దిగింది.
Karnataka Rains: కర్నాటకలో వర్ష బీభత్సం.. 12 మంది మృతి
ఆంబుష్ పార్టీ నైట్ విజన్ పరికరాల ద్వారా ఉగ్రవాదులను కదలికలను ట్రాక్ చేసింది. సుమారు 01.15 గంటలకు కాల్పులు జరిగాయి. దీంతో ఒక ఉగ్రవాది చనిపోయారు. మరో ఉగ్రవాది నియంత్రణ రేఖ మీదుగా పారిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల సమయంలో నాయక్ జస్వీర్ సింగ్ కు కూడా అమరుడయ్యారు. జూలై 8వ తేదీన ఉగ్రవాది మృతదేహం వెలికితీశారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఒక ఏకే సిరీస్ రైఫిల్, నాలుగు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్‌లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ.. ఉగ్ర సంబంధాల బహిర్గతానికి కాంగ్రెస్ దేశవ్యాప్త సమావేశాలు !
ఎన్ కౌంటర్ జరిగినప్పుడు ఆంబుష్ పార్టీలో భాగంగా ఉన్న నాయక్ జస్వీర్ సింగ్ కు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను వెంటనే మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడికి చేరుకోగానే జవాన్ మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. వీర జవాన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాయక్ జస్వీర్ సింగ్ భారత సైన్యం విలువలు, సంప్రదాయాలు, నీతిని ప్రతిబింబించారు. నేడు లెఫ్టినెంట్ జనరల్ ADS ఔజ్లా, GOC చినార్ కార్ప్స్ చినార్ వార్ మెమోరియల్ వద్ద అన్ని ర్యాంక్‌ల తరపున పుష్పగుచ్ఛం ఉంచారు. జవాన్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వస్థలానికి పంపించారు. పూర్తి సైనిక గౌరవాలతో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా ఈరోజు తెల్లవారుజామున, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు ఆర్మీ 22 ఆర్‌ఆర్‌తో కలిసి బారాముల్లా జిల్లాలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటీ) హైబ్రిడ్ ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేశారు. ఉగ్రవాదిని తిల్గాం పయీన్‌కు చెందిన మహ్మద్ ఇక్బాల్ భట్‌గా గుర్తించారు. బారాముల్లాలోని క్రీరీ ప్రాంతంలో చెక్‌పాయింట్‌లో అతడిని అరెస్టు చేశారు.
క్రీరీ ప్రాంతంలో తీవ్రవాద కదలికలకు సంబంధించి విశ్వసనీయ ఇన్‌పుట్ ఆధారంగా, పోలీసు, ఆర్మీ 29 RR ఉమ్మడి పార్టీలు క్రీరీ వద్ద నాకాను స్థాపించాయి. నాకా తనిఖీల్లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సంస్థకు చెందిన ఒక హైబ్రిడ్ ఉగ్రవాది ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి ఒక పిస్టల్, ఒక పిస్టల్ మ్యాగజైన్, 7 రౌండ్ల పిస్టల్ మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.