
ముంబయి: ఓ వ్యక్తి అఫీషియల్ ట్రిప్ అని భార్యకు అబద్ధం చెప్పి లవర్‌తో మాల్దీవ్‌లో ఎంజాయ్ చేశాడు. తన భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తరుచూ విసిగించడంతో ఆ ట్రిప్‌ను మధ్యలోనే ముగించేసి వెనక్కి ప్రయాణం అయ్యాడు. కానీ, తన భార్యకు ఈ విషయం తెలియవద్దని పాస్‌పోర్టులో వీసా స్టాంప్ వేసిన పేజీలను చింపేశాడు. తీరా వెనక్కి రాగానే.. ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద గిలగిల్లాడిపోయాడు.
ముంబయికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఓ ఎంఎన్‌సీలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. తన భార్యకు తెలియకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆఫీసులో సెలవులు పెట్టి లవర్‌తో మాల్దీవుల్లో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఆయన తన భార్యతో అబద్ధం ఆడాడు. తన ఆఫీసు వర్క్‌పైనే ఫారీన్ ట్రిప్ వెళ్తున్నట్టు చెప్పాడు.
అక్కడికి వెళ్లాక లవర్‌తో ఎంజాయ్ చేస్తుండగా భార్య ఫోన్ చేసింది. కానీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆమెకు అనుమానం వచ్చింది. ఫోన్లు మళ్లీ మళ్లీ చేసింది. వాట్సాప్‌లోనూ ఫోన్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆ వ్యక్తి తన వెకేషన్‌ను కుదించుకున్నాడు. వెనక్కి ఇంటికి వచ్చేయాలని అనుకున్నాడు.
కానీ, తన లవర్‌తో మాల్దీవుల్లో తిరిగినట్టు భార్యకు తెలియవద్దని అనుకున్నాడు. అందుకే వీసా స్టాంప్ చేసిన పాస్‌పోర్టు పేజీలను చించేశాడు. ఆ తర్వాత ఆయన మాల్దీవుల నుంచి ముంబయిలో దిగాడు. గురువారం రాత్రి ఆయన ముంబయిలో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన పాస్‌పోర్టును చూశారు. అందులో పేజీలు 3 నుంచి 6, అలాగే 31 నుంచి 34 పేజీలు మిస్ అయినట్టు గుర్తించారు. ఈ పేజీలు ఏమయ్యాయని అడగ్గా.. ఆ ఇంజినీర్ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వెంటనే ఆయనను పోలీసులకు హ్యాండోవర్ చేశారు. చీటింగ్, ఫోర్జరీ అభియోగాల కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయన ఉద్దేశపూర్వకంగానే పాస్‌పోర్టులోని పేజీలు చించేశాడని ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు. మాల్దీవుల నుంచి ఇండియాకు వచ్చిన పాస్‌పోర్టులో పేజీలు మిస్ అయ్యాయని, ఆ ఇంజినీర్ కావాలనే ఇమ్మిగ్రేషన్ అధికారులను చీట్ చేశాడని పేర్కొన్నారు.
పోలీసులు గట్టిగా విచారించగా.. ఇంజినీర్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. తన లవర్‌తో కలిసి హాలీడేను మాల్దీవులో ఎంజాయ్ చేశాడు. తన భార్యకు ఈ విషయం తెలియకుండా రహస్యంగా ఉంచడానికే పాస్ పోర్టు పేజీలను చించేసినట్టు ఒప్పుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్టును ధ్వంసం చేయడం నేరం అనే విషయం ఆ వ్యక్తికి తెలియదని చివరకు పోలీసులు వివరించారు.